ఆర్జీవి వెనకడుగు.. నిజంగానే బాలయ్యకు భయపడ్డాడా..?

ఇండస్ట్రీలో నిత్యా వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మకి ఒక ప్రత్యేకమైన పేరు ఉంది. వర్మకు అసలే భయం లేదని, ఎవరినైనా కూడా ఎదిరిస్తాడని, ఎల్లప్పుడూ గంభీరంగానే కనిపిస్తాడని అందరు చాలా బాగా చెప్పుకుంటారు. ఎంతమంది ఎన్ని రకాలుగా విమర్శించినప్పటికీ కూడా, వర్మ తనదైన శైలిలో అందరికి సమాధానం చెబుతూనే ఉంటాడు. కానీ అలంటి ఆర్జీవీ మన నందమూరి నటసింహం బాలకృష్ణ కి బయపడుతున్నాడని సినీ పరిశ్రమలో అందరు కూడా చెప్పుకుంటున్నారు. దానికి కారణం లేకపోలేదు. ఆర్జీవీ ఇటీవల తెరకెక్కించిన చిత్రం కమ్మ రాజ్యంలో కడప రెడ్లు.

కాగా ఈనెల 29న విడుదల కానున్న ఈ చిత్రానికి సంబందించిన ట్రైలర్ కూడా ఎప్పుడో విడుదలైంది. అయితే ఈ చిత్రంలో రాష్ట్ర  రాజకీయ నాయకులందరిపైనా తనదైన శైలిలో సెటైర్లు వేస్తూనే ఉన్నాడు మన ఆర్జీవీ. కానీ ఈ చిత్రంలో అసలు బాలకృష్ణ మాత్రం ఎక్కడా కనిపించలేదు. రాష్ట్ర రాజకీయాలతో పాటు పార్టీలో కూడా కీలకంగా ఉంటున్నటువంటి బాలయ్య పై కూడా ఇలాంటి సెటైర్లు ఉంటాయని అందరు అనుకున్నారు కానీ, అసలు బాలయ్య పేరు కూడా ఎక్కడా వినిపించడం లేదు. ఇదంతా కూడా గమనిస్తే బాలయ్య నుంచి వర్మకు వార్నింగ్ కానీ వెళ్లిందా అని ఇండస్ట్రీలో పలువురు చర్చించుకుంటున్నారు. కానీ ఏదైనా కూడా ఆర్జీవీ అధికారికంగా ప్రకటించాల్సిందే మరి…