మళ్ళీ ‘మెగా’ చిచ్చు రగిల్చిన వర్మ

అవకాశం వస్తే చాలు తన పైత్యం ప్రదర్శించాలని సిద్ధంగా ఉండే వర్మకు ఆ ఛాన్స్ మళ్ళీ వచ్చింది. ఏపీలో పవన్ కళ్యాణ్ జనసేన కేవలం 2 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉండడంతో.. ఆ పార్టీని టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. చిరంజీవి, పవన్‌ల రాజకీయ ప్రస్థానాల్ని పోలుస్తూ… తమ్ముడు కంటే చిరంజీవినే చాలా బెటరంటూ చెప్పాడు. ఇందుకు అతడు కంగ్రాట్స్ తెలపడం గమనార్హం!

‘జనసేనతో పోలిస్తే ప్రజారాజ్యం బాహుబలి పార్టీ.. కంగ్రాట్స్ చిరంజీవిగారు’ అంటూ వర్మ ట్వీటాడు. 2008లో ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన చిరంజీవి… 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 18 సీట్లు సాధించిన సంగతి తెలిసిందే. తమ్ముడు జనసేన పార్టీతో అంతకంటే ఎక్కువ సీట్లే సాధిస్తాడనుకుంటే.. 2 స్థానాల అధిక్యానికి పరిమితం కావడంతో వర్మ ఈ కౌంటర్ పేల్చాడు.