రవితేజ తప్పు చేస్తున్నాడా..? ఒకే సినిమాకు రెండు రీమేకులు

ఒక సినిమా తమిళం నుంచి తెలుగులోకి అనువాదమై రిలీజ్ అయినా పట్టించుకోకుండా రీమేక్‌ చేసిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. ‘లూసిఫర్’ సినిమా డబ్బింగ్ వెర్షన్ తెలుగులో రిలీజైనప్పటికీ ఆ సినిమా హక్కులు కొని మెగాస్టార్ చిరంజీవి హీరోగా రీమేక్ చేయడానికి రామ్ చరణ్ రెడీ అయిన సంగతి తెలిసిందే. ఐతే ఇదే విడ్డూరం అంటే.. ఒక సినిమా ఆల్రెడీ తెలుగులో రీమేక్ అయిందని తెలిసి కూడా మళ్లీ అదే కథను కొంచెం అటు ఇటుగా మార్చి రెండోసారి తీయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లుగా టాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తుండటం విశేషం.గతంలో అమితాబ్ బచ్చన్ బ్లాక్ బస్టర్ మూవీ ‘డాన్’ను తెలుగులో ‘యుగంధర్’ పేరుతో తీస్తే దాని మోడర్న్ స్టయిల్లో ‘బిల్లా’గా తీశారు.

కానీ ఇలా దశాబ్దాల విరామం కాకుండా కేవలం రెండేళ్ల కిందట తెలుగులోకి రీమేక్ అయిన తమిళ సినిమాను మళ్లీ తీయబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.మాస్ రాజా రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ పోలీస్ కథ తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. గురువారమే ఈ చిత్రం ప్రారంభోత్సవం కూడా జరుపుకోనుంది. ఈ చిత్రానికి తమిళ హిట్ మూవీ ‘సేతుపతి’ ఆధారం అని వార్తలొస్తున్నాయి. విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కిన ఈ పోలీస్ స్టోరీ అక్కడ సూపర్ హిట్టయింది. అందులో హీరో ఎలివేషన్ ఓ రేంజిలో ఉంటుంది. ఇలాంటి కథ తెలుగులో బాగా సూటయ్యే హీరోల్లో రవితేజ ఒకడన్నది వాస్తవం.ఐతే ఈ రవితేజ కంటే ముందు మరో రవితేజ ‘సేతుపతి’ రీమేక్‌లో నటించిన సంగతి చాలా మందికి తెలియదు.ఆ రవితేజ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తనయుడు.

జయంత్ సి.పరాన్జీ దర్శకత్వంలో అతణ్ని హీరోగా పరిచయం చేస్తూ తీసిన ‘జయదేవ్’ చిత్రం ‘సేతుపతి’కి రీమేక్. ఆ సినిమాను ఎంత చెత్తగా తీయాలో అంత చెత్తగా తీశారు. గంటా రవితేజ దారుణమైన నటనతో సినిమాను మరింతగా నీరుగార్చేశాడు. ఈ సినిమాను జనాలు అసలేమాత్రం పట్టించుకోని నేపథ్యంలో మళ్లీ ఈ కథకు మార్పులు చేర్పులు చేసి.. కొన్ని ముఖ్యమైన ఎపిసోడ్లు తీసుకుని తన టచ్ ఇస్తూ రవితేజ హీరోగా సినిమా తీయడానికి గోపీచంద్ రెడీ అయినట్లుగా చెబుతున్నారు. ఇదెంత వరకు నిజమో.. ఈ ప్రయోగం ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి మరి.

Recommended For You

Leave a Reply

Your email address will not be published.