రవితేజ ని ఎంటర్ చేసిన డైరెక్టర్…

బి ద రియల్ మ్యాన్ ఛాలెంజ్ లో భాగంగా విక్టరీ వెంకటేష్ ,నిన్న సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడిని ఈ ఛాలెంజ్ కు నామినేట్ చేశాడు. తాజాగా అనిల్ ఆ ఛాలెంజ్ ను పూర్తి చేశాడు. అందుకు సంబంధించిన వీడియో ను ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. అంతేకాదు ఈ ఛాలెంజ్ కోసం రవితేజ, కళ్యాణ్ రామ్ ,సాయి ధరమ్ తేజ్ ను నామినేట్ చేస్తున్నట్లు అనిల్ ప్రకటించాడు. సందీప్ రెడ్డి వంగ శ్రీకారం చుట్టిన ఈ ఛాలెంజ్ ప్రస్తుతం ట్రెండింగ్ లో కొనసాగుతుంది. ఇప్పటికే చిరంజీవి ,వెంకటేష్, ఎన్టీఆర్ , రామ్ చరణ్ తదితరులు ఈ ఛాలెంజ్ ను పూర్తి చేశారు.

కాగా బాలకృష్ణ , నాగార్జున , మహేష్ బాబు ఈ ఛాలెంజ్ ను పూర్తి చేయాల్సి వుంది అయితే నెటిజన్లు మాత్రం బాలయ్య వీడియో కోసం ఎదురుచూస్తున్నారు.ఇక ఇటీవల సరిలేరు నీకెవ్వరు వరసగా రెండో బ్లాక్ బాస్టర్ ను ఖాతాలో వేసుకున్నఅనిల్ ప్రస్తుతం ఎఫ్ 3 స్క్రిప్ట్ పనుల్లో బిజీ గా వున్నాడు. బ్లాక్ బాస్టర్ ఎఫ్ 2 కు సీక్వెల్ గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో వెంకటేష్ , వరుణ్ తేజ్ లతోపాటు మరో హీరో కూడా ఉంటాడని టాక్. వచ్చే ఏడాది ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది.