రవితెజ న్యూలుక్.. అదరగోట్టాడుగా…

మాస్ మహారాజా రవితేజ కు గతేడాది చేదు అనుభవాన్ని మిగిల్చినా… కొత్త ఏడాదిలోకి రెట్టించిన ఉత్సాహంతో అడుగులు వేస్తున్నాడు. 2020లో అన్ని లెక్కల్ని సరి చేయాలని కసితో పనిచేస్తున్నాడు. వరుసగా హ్యాట్రిక్ ప్లాపులు నిరాశపరిచినా ఈ ఏడాది వరుస విజయాలు అందుకుని ప్రతిదీ బ్యాలెన్స్ చేయాలని పట్టుదలతో శ్రమిస్తున్నాడు. ఇప్పటికే రెండు సినిమాల్ని లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే. ఎక్కడిపోతాడు చిన్నవాడా దర్శకుడు వి. ఐ ఆనంద్ తో డిస్కోరాజా చేస్తుండగానే.. మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో క్రాక్ అనే మరో సినిమాలో నటిస్తున్నాడు.

 

ఇప్పటికే డిస్కోరాజాపై అంచనాలు భారీగా ఏర్పడుతున్నాయి. ఇటీవలే విడుదలైన టీజర్  ఆకట్టుకుంది. మిగతా ప్రచార చిత్రాలు అంతే ఊపును  తీసుకొస్తున్నాయి. అటు క్రాక్ సినిమా పోస్టర్ లతోనే    అదరగొడుతున్నాడు. ఇందులో రవితేజ పోలీసాఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. తొలి పోస్టర్ తోనే ఆ విషయాన్ని దర్శకుడు రివీల్ చేసాడు. రవితేజ అభిమానులకు కావాల్సిన అన్ని అంశాలు పుష్కలంగా ఉన్నాయని తొలి పోస్టర్ తోనే చెప్పేసాడు. తాజాగా కొత్త సంవత్సరం సందర్భంగా రవితేజ్ కు చెందిన మరో న్యూ లుక్ ని వదిలాడు. ఈ పోస్టర్ లోనూ అదే టెంపోను కొనసాగించాడు.కాప్ పాత్రలో రాజా మరోసారి మాసిజాన్ని చూపించాడు.

 

ఏపీ ఎస్ పీ అని రివీల్ చేశారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ కి చెందిన పోలీస్ అన్నమాట. ఇక ఆ రైట్ హ్యాండ్ తో సోడా బుడ్డి పట్టుకుని తీక్షణంగా చూస్తున్నాడేమిటో. రవితేజ ఈ లుక్ మాస్ లోకి దూసుకుపోయేలా డిజైన్ చేసి వదిలారు. నేనింతే…నా స్టైల్ ఇంతే! అన్న తీరుగా రవితేజ లో మాస్ యాంగిల్… డైరెక్టర్  విజన్ పోస్టర్ లో కనిపిస్తోంది. కొత్త ఏడాది మొదటిరోజు మాస్ రాజా అభిమానులకు కావాల్సినంత కిక్కును అందించాడు. ఈ చిత్రాన్ని ఠాగూరు మధు నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published.