రాత్రికి వస్తావా.. దిమ్మతిరిగే రిప్లై ఇచ్చిన రశ్మీ

తాజాగా రష్మీ లైవ్ వీడియోలో పాల్గొని అభిమానులతో ముచ్చటించింది. ఈ క్రమంలో ఆమెని కొందరు అసభ్యకరమైన ప్రశ్నలు అడిగారు. ఈ క్రమంలో వారి పై మండిపడింది రష్మీ. “కొందరు పిచ్చి రాతలు రాస్తూ నాకు అసభ్యకర మెసేజ్ లు పెడుతున్నారు. అయితే నేను మెచ్యూర్డ్ గా ఆలోచిస్తాను కాబట్టి అలాంటి విషయాలు పట్టించుకోను. ఆ మెసేజ్ లు నా పై పెద్దగా ప్రభావం కూడా చూపవు.

అలా మెసేజ్ లు పెట్టే వారి గురించి పట్టించుకోకపోయినా.. ఆ మెసేజ్ లు సమాజంలో ఎక్కిస్తున్నారు. అలాంటి పిచ్చికుక్కల వల్లే ప్రస్తుతం అమ్మాయిలు బాహాటంగా మాట్లాడలేకపోతున్నారు. నేను పబ్లిక్ ఫిగర్ ని కాబట్టి.. నాకు ఇలాంటి మెసేజ్ లు వస్తున్నాయని అనుకోవడం పొరపాటు. రెగ్యులర్ గా ఉద్యోగాలు చేస్తున్న ఎందరో అమ్మాయిల పై ఇలాంటి దాడి జరుగుతుంది. ‘రాత్రికి ఎంతిస్తే వస్తావ్..? ఎంత డబ్బు కావాలంటూ’ వల్గర్ గా కామెంట్లు పెడుతున్నారు. అలా అడగడానికి సిగ్గుగా లేదా..?అసలు నేను మీతో ఎందుకు పడుకుంటాను. మీరేం.. అంత ఉద్దరించారని…!

నా ఒక్కదాని గురించే ఇలా మాట్లాడటం లేదు.. ఇలాంటి కామెంట్ల వల్ల బాధలు పడుతున్న అమ్మాయిలు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళ గురించి కూడా మాట్లాడుతున్నాను” అంటూ మండిపడింది.