రష్మీ వల్ల అంత నష్టం జరిగిందా..? సీక్రేట్ బయట పెట్టిన సుధీర్

హాట్ యాంకర్ రష్మీ సుడిగాలి సుధీర్ మధ్యగల లవ్ ట్రాక్ పై ఇప్పటికే అనేరకాల వార్తలు వచ్చాయి. దీనికితోడు వీరిద్దరూ కలిసి చేసిన బుల్లితెర షోలలో వీరి సానిహిత్యం చూసిన వారు వీరిద్దరి మధ్య ఖచ్చితంగా ప్రేమ వ్యహారం నడుస్తోంది అంటూ ఊహాగానాలు చేస్తూనే ఉన్నారు. వాస్తవానికి సుధీర్ మరోవైపు రష్మీ తమ మధ్య ఏమీలేదని ఎన్నో సార్లు క్లారిటీ ఇచ్చినా సుధీర్ కనిపించి నప్పుడల్లా రష్మితో అతడి రిలేషన్ షిప్ గురించి ప్రశ్నలు వస్తూనే ఉన్నాయి.

ఇలాంటి పరిస్థితులలో ఈ మధ్య ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సుడిగాలి సుధీర్ రష్మీ గురించి చేసిన షాకింగ్ కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.ఒక ప్రముఖ ఛానల్‌ లో ప్రసారమయ్యే ‘ఢీ’ షోలో సుధీర్ ఇటీవల రష్మి వ్యవహారం పై స్పందించాడు. ‘రష్మీ అనే అమ్మాయి లేకపోతే నాకు ఇంత పేరు వచ్చేది కాదు. సుధీర్ అంటే నా టాలెంట్ గురించి మాట్లాడరు. సుధీర్ – రష్మీ అంటారు. ఈ అమ్మాయి నా లైఫ్‌లో లేకపోతే నాకు లైఫే లేదు. ఆమె ప్రభావం నాపై ఎంతో ఉంది’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు.అంతేకాదు ఇక్కడ మరొక ఊహించని ట్విస్ట్ ఇస్తూ తామిద్దరం ఎప్పుడు ఫోన్ లో కూడ మాట్లాడుకోలేదనీ అలాంటి పరిస్థితులలో తమ మధ్య రిలేషన్ షిప్ ఉంది అంటూ వార్తలు ఎలా వస్తున్నాయో తనకు ఏమీ అర్ధం కావడం లేదు అని అంటూ కామెంట్స్ చేసాడు. వాస్తవానికి తన జీవితంలో లవ్ ఫెయిల్యూర్ ఉందని అందువల్ల తాను అమ్మాయిలతో పెద్దగా సన్నిహితంగా ఉండను అంటూ ఒక సీక్రెట్ బయట పెట్టాడు.

అయితే తన ఇంటి కుటుంబ సభ్యుల ఒత్తిడితో తాను పెళ్ళి చేసుకోవాలని ప్రయత్నిస్తున్నా చాలామంది తనకు రష్మికి ఎఫైర్ నడుస్తోంది అన్న అనుమానంతో తనను పెళ్ళి చేసుకోవడానికి ఇష్టపడటం లేదు అంటూ ఒక విధంగా రష్మి తనకు అదృష్టం మరొక విధంగా తనకు దురదృష్టం అంటూ సుదీర్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. దీనితో సుధీర్ రష్మి వల్ల నష్టపోయాడు అంటూ అనేక కామెంట్స్ వినిపిస్తున్నాయి..