ఎన్నటికి అలా జరగదు.. రష్మీతో బందాన్ని తేల్చి చెప్పిన సుధీర్

యాంకర్ రష్మీ, సుడిగాలి సుధీర్.. ఈ పేర్లు వినగానే ముందుగా గుర్తొచ్చేది వీళ్ళ ఎఫైర్. జబర్దస్త్ స్టేజ్‌పై, సోషల్ మీడియాలో తరచూ వినిపించే కామెంట్స్ వీరిద్దరి లవ్ ట్రాక్, రొమాన్స్ గురించే. అంతలా పాపులారిటీ వచ్చేసింది ఈ జోడీకి. రాను రాను ఈ ఇద్దరిపై రూమర్స్ మరీ శృతిమించి పోతున్నాయి. ఇది గమనించిన సుడిగాలి సుధీర్ రియాక్ట్ అవుతూ ఆసక్తికర విషయాలు చెప్పాడు. ఆ వివరాలు చూద్దామా..అమ్మాయిలను పడేయటంలో సుడిగాలి సుధీర్ని మించినోడు లేడని, ఎంతో మంది అమ్మాయిలతో ఆయనకు ఎఫైర్స్ ఉన్నాయని వార్తలు విన్నాం. ముఖ్యంగా రష్మీ- సుధీర్ మధ్య ఏదో నడుస్తోందని గత కొన్నేళ్లుగా వింటూ వస్తున్నాం.

ఈ ఎఫైర్స్ కారణంగానే సుధీర్‌కి పెళ్లి కావడం లేదని చెప్పుకున్నారు. సో ఇప్పుడు వీటిపైనే క్లారిటీ ఇచ్చాడు సుధీర్.తనకు ఏ అమ్మాయితో ఎఫైర్ లేడని గుట్టు బయటపెట్టేశాడు సుధీర్. రష్మితో నాకు ఎఫైర్ ఉందనేది కూడా రూమర్ మాత్రమే అని కొట్టిపారేశాడు. తాను నిజంగానే అమ్మాయిలతో తిరగటం, ఫ్లర్ట్ చేయడం లాంటివి చేస్తే ఎప్పుడో దొరికేవాడినని అన్నాడు. నా ఎఫైర్ సంగతులు నిజమే అయితే ఎక్కడైనా ప్రూఫ్ దొరికిందా? మీరే చెప్పండి అనేశాడు సుధీర్.
తాను చాలా రిజర్వ్డ్‌ కాండిడేట్ అని, కావాలంటే నా గురించి ఇండస్ట్రీలో అడిగి తెలుసుకోండి అని అంటున్నాడు సుధీర్. తాను బేసిక్ గా అమ్మాయిలతో క్లోజ్ రిలేషన్‌షిప్ మెయిన్‌టైన్ చేయనని, ఏదో హాయ్ అంటే హాయ్.. బాయ్ అంటే బాయ్ అన్నట్లుగానే ఉంటానని సుధీర్ తెలిపాడు. ఎక్కువ సమయంలో ఇంట్లోనే ఉంటా తప్ప వేరెక్కడికీ వెళ్లనని అన్నాడు.
సుడిగాలి సుధీర్- రష్మీ లిప్‌లాక్ అని వార్తలు చూస్తుంటా. కానీ అందులో సుధీర్ ఉండడు, రష్మి ఉండదు. సుధీర్, రష్మి హోటల్‌లో దొరికారు అని రాస్తారు.. అందులోను ఏమీ ఉండదు అని అన్నాడు సుధీర్. మొత్తానికి నిజానికి తమ మధ్య ఏదీ లేడని క్లారిటీ ఇచ్చేశాడు ఈ జబర్దస్త్ కమెడియన్.


తనకు సింగిల్ గా ఉండటమే ఇష్టమని, ఒకరిద్దరు కంటే ఎక్కువ మంది అమ్మాయిలతో మాట్లాడిన సందర్భాలే లేవని సుధీర్ అన్నాడు. కావాలంటే ఫోన్ ఇస్తా ట్రాక్ చేసుకోండి, కాల్ లిస్ట్ చెక్ చేసుకోండి అని కూడా అనేశాడు. తనది లవ్ ఫెయిల్యూర్ అని అందుకే ఇలాంటివి ఇష్టముండదని అసలు విషయం బయటపెట్టేశాడు సుధీర్.