రాశి కన్నాకి కష్టాలు తప్పేలా లేవుగా…

వారం వ్యవధిలో రెండు పెద్ద సినిమాలు విడుదలకి సిద్ధమయ్యే సరికి రాశి ఖన్నా నిరంతరం పబ్లిసిటీ ప్రోగ్రామ్స్‌తో సతమతమైపోతూ వుంది. ‘వెంకీ మామ’ రిలీజ్‌ డేట్‌ అనూహ్యంగా డిసెంబర్‌ 13కి మారడంతో రాశి ఖన్నా ఆ చిత్రం ప్రమోషన్స్‌కి టైమ్‌ కేటాయించడానికి తిప్పలు పడుతోంది.ప్రతిరోజూ పండగే చిత్రం పబ్లిసిటీ కోసం రాశి డిసెంబర్‌ 25 వరకు డేట్స్‌ కేటాయించింది.కానీ వెంకీ మామ కూడా రిలీజ్‌కి రావడంతో ఇప్పుడు రాశి అటు కూడా ఒక కాలేసి రావాల్సి వస్తోంది.

రెండు సినిమాలకి ప్రమోషన్లు గట్టిగా చేస్తుండడంతో ఆమెకి అసలు తీరికే వుండడం లేదు. రెండు పెద్ద సినిమాలు ఒకే టైమ్‌లో విడుదల కావడం ఆనందదాయకమే అయినా కానీ ఆమెకి ప్రమోషన్లతోనే కాలం గడిచిపోతోంది. వెంకీ మామలో చైతన్య సరసన నటించిన రాశి, ప్రతిరోజూ పండగేలో సోలో హీరోయిన్‌గా నటించింది.టిక్‌ టాక్‌ సెలబ్రిటీగా అందులోని ఆమె పాత్ర హైలైట్‌ అని చిత్ర బృందం చెబుతోంది. కెరియర్‌ పరంగా ఈ రెండు సినిమాలు తనకి కీలకం కనుక రాశి ఖన్నా ప్రస్తుతం రెండిటికీ ప్రచారం చేయడం కష్టమవుతున్నా కానీ ఏమాత్రం కంప్లయింట్‌ చేయకుండా రెండిటికీ తగిన న్యాయం చేసేస్తోంది.