అది రజినీకాంత్ రెంజ్… దర్భార్ ప్రమోషన్స్ ఏలా జరిగాయో తెలుసా..

సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్ హీరోగా స్టార్ డైరెక్ట‌ర్ ఎ.ఆర్‌.మురుగ‌దాస్ దర్శ‌క‌త్వంలో తాజాగా రూపొందుతోన్న చిత్రం ద‌ర్బార్‌. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 9న ఈ సినిమాను విడుద‌ల చేస్తుండగా, తెలుగులో మాత్రం ఎన్ వి ప్రసాద్ విడుదల చేస్తున్నారు.

 

అయితే ఈ చిత్రానికి సంబంధించి రేపు హైదరాబాద్‌లోని శిల్పక‌ళా వేదిక‌లో ప్రీ రిలీజ్ వేడుక జరగనుంది. అయితే రిలీజ్ సమయం దగ్గరపడుతున్న కొద్ది సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా జోరందుకున్నాయి. అయితే ఈ సినిమాకి సంబంధించిన రజినీ పోస్ట‌ర్స్ మొన్నటి వరకు బ‌స్సులు, రైళ్ళపై దర్శనమిచ్చాయి. అయితే కాస్త ముందడుగు వేసిన చిత్ర బృందం ఇప్పుడు ఆకాశంలో కూడా ప్రమోషన్ కార్యక్రమాలు జరుపుతున్నాయి. అదెలా అని ఆశ్చర్యపోతున్నారా? ద‌ర్భార్ సినిమా పోస్ట‌ర్స్ విమానాల‌పై వేయించి ప్రమోషన్స్ చేయిస్తున్నారు. అయితే ప్రమోషన్ సంగతి మాత్రం పక్కనపెడితే వీటిని చూసిన రజినీ ఫ్యాన్స్ మాత్రం తెగ సంబరపడిపోతున్నారు.