రామూ రచ్చ మమూలుగా లేదుగా…

సబ్బు బిల్లా.. అగ్గి పుల్లా.. కాదేది కవితకు అనర్హం అన్నారు శ్రీశ్రీ. ఇప్పుడు ఇప్పుడు సినీ ప్రపంచంలో రాంగోపాల్ వర్మ సైతం దేన్నీ వదలడం లేదు. ముఖ్యంగా ఆయన సెలబ్రెటీల విషయంలో ఆయన తనదైన వెరైటీ ట్విట్స్ తో సంచలనాలు రేపుతున్నారు. సినీ, రాజకీయ, క్రీడా ఇతర రంగాలకు చెందిన వారి విషయంలో ఏ చిన్న లూప్ లైన్ ఉన్నా వెంటనే దాన్ని ఎక్స్ పోజ్ చేస్తూ తనదైన స్టైల్లో ట్వీట్ చేస్తున్నారు. ఇక కరోనా వచ్చినప్పటి నుంచి ఆయన చేస్తున్న ట్విట్స్ సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి.

ప్రపంచాన్ని తనవైపు తిప్పుకొని సంచలనాలు రేపిన ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్యస్థితి విషమంగా ఉందంటూ వచ్చిన కథనాలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఈ అంశంపై చిన్నా పెద్ద దేశాలు తెగ చర్చలు జరుపుకుంటున్నాయి. ఇదిలా ఉంటే ఒకవేళ కిమ్ జోంగ్ ఉన్ ఏం జరిగినా ఆయన సోదరి దేశ పగ్గాలు చేపడుతుందని అంటున్నారు. అయితే కిమ్ జోంగ్ కన్నా ఆమె రెండు ఆకులు ఎక్కువే చదివిందట..ఆమె సోదరిడి కన్నా ఇంకా కఠినంగా ఉంటుందని వార్తలు వచ్చాయి.తాజాగా దీనిపై స్పందించిన వర్మ ఆమె అతనికంటే కిరాతకురాలు అని తెలుస్తోంది.

గుడ్ న్యూస్ ఏంటంటే, ఈ ప్రపంచానికి మొట్టమొదటి లేడీ విలన్ వస్తోంది. అదే జరిగితే జేమ్స్ బాండ్ కూడా రంగంలోకి దిగొచ్చు” అంటూ ట్వీట్ చేశారు. . కిమ్ కు ఏదన్నా జరిగితే ఆయన సోదరి కిమ్ యో జోంగ్ పాలనా పగ్గాలు అందుకుంటారని ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే దేశంలో కరోనా కట్టడి చేయడానికి లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి సెలబ్రెటీలు ఇంటిపట్టున ఉంటూ రక రకాలుగా ట్విట్స్ చేస్తున్న విషయం తెలిసిందే