రాం చరణ్ ఎఫెక్ట్.. RRR బాగా లేటవనుందా..?

టాలీవుడ్ నుంచి రాబోతున్న మరో ప్రిస్టేజియస్ ప్రాజెక్ట్ “RRR”. యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు ప్రధాన పాత్రధారులుగా దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.అయితే రాజమౌళి ఈ సినిమా విడుదల తేదీను చాలా ముందే ప్రకటించేసారు.అంతే కాకుండా ఎట్టి పరిస్థితుల్లోనే అదే తేదికు సినిమాను ప్రేక్షకుల ముందు ఉంచాలని భావిస్తున్నట్టుగా ఉన్నారని సినీ వర్గాల్లో కూడా వార్తలు గట్టిగానే వచ్చాయి.

కానీ ఇప్పుడున్న పరిస్థితులను చూస్తున్నట్టయితే సినిమా అనుకున్న సమయానికి వస్తుందా రాదా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.ఈ చిత్రంలో స్వాతంత్ర సమర యోధుడు అల్లూరి సీతారామరాజు పాత్రను రామ్ చరణ్ పోషిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.అయితే ఈ పాత్రకు సంబంధించి రామ్ చరణ్ అసలు ఎంత వరకు నటించాడు?ఎన్ని రోజులు షూటింగ్ లో పాల్గొన్నారు అన్న విషయాలు పెద్ద మిస్టరీగా మిగిలిపోయాయి.RRR సంగతి కాకుండా మిగతా అన్ని అంశాల్లో బాగా ఎక్కువగా తారక్ కంటే ఎక్కువగా చరణే కనిపిస్తున్నారు.దీనితో రామ్ చరణ్ ఎప్పుడు మళ్ళీ షూటింగ్ లో పాల్గొంటారు?ఈ చిత్రం అనుకున్న సమయానికే రాజమౌళి అందిస్తారా లేక బాహుబలికి వేసినట్టుగానే లేట్ చేసి బాంబు వేస్తారా

అన్న అనుమానాలు చరణ్ అభిమానులను తొలచివేస్తున్నాయి.ఇప్పటికే ఈ ఏడాది కూడా ముగుస్తుంది.జూలైలో సినిమా అన్నారు కాబట్టి మళ్ళీ చివర్లో గ్రాఫిక్స్ పని పూర్తవ్వలేదు అది ఇది అని వాయిదా వేస్తారో లేదా మాటకు కట్టుబడి అనుకున్న సమయానికే విడుదల చేస్తారో చూడాలి.