పెళ్ళయ్యాక ఉపాసన తెచ్చుకున్న ఆస్తి విలువ ఎంతో తెలుసా?

మెగా స్టార్ చిరంజీవి తనయుడి గా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్,మగధీర తో మెగా హిట్ కొట్టి తెలుగు అగ్ర కథానాయకుల జాబితాలోకి చేరిపోయాడు.అంతే కాకుండా అభిమానుల చేత మెగా పవర్ స్టార్ అని పిలుపించుకునే స్థాయి కి ఎదిగాడు. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో 15 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకునే జాబితాలో చరణ్ చేరిపోయాడు. చరణ్ రాజమౌళి దర్శకత్వంలో RRR సినిమాతో బిజీగా ఉన్నాడు.ఇక పర్సన్ లైఫ్ విషయానికొస్తే, అపోలో హాస్పిటల్ ప్రతాప్ రెడ్డి మనవరాలు ఉపాసన కామినేనితో రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ టెంపుల్ హౌస్ లో 2012లో అత్యంత వైభవంగా వివాహం జరిగింది.

పవన్ కళ్యాణ్ ప్రాణస్నేహితుడు, సినీ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి పర్యవేక్షణలో పెళ్లి మండపం డిజైన్ చేయడం విశేషం. రామ్ చరణ్ కి అత్తమామలు కట్నంగా 350కోట్లు ఇచ్చినట్లు అప్పటిలో వార్తలు షికారు చేసేవి.అంతేకాదు చాలా చోట్ల ఖరీదైన భూములు , కొన్ని ఫ్లాట్స్ లాంఛనంగా ఇచ్చారట. ఇక చెర్రీ ఉపాసన పేరెంట్స్ బహుకరించిన ఆస్టిన్ మార్టిన్ కారు మరో ఎత్తు. కేవలం ఇద్దరు మాత్రమే కూర్చునే ఈ కారు గంటకు 320కిలోమీటర్ల వేగంతో ప్రయాణం సాగిస్తుంది. ఇక ఈ కారు ఖరీదు రెండు కోట్ల రూపాయలుంటుంది.