నావల్ల అస్సలు కాదు.. కాబోయే వాడి గురించి సంచలన విషయాలు చెప్పేసిన రకుల్

టాలీవుడ్, బాలీవుడ్ తెరలపై గ్లామర్ రోల్స్ పోషిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది రకుల్ ప్రీత్ సింగ్. తనలో అందం, అభినయం రెండూ ఉన్నాయని నిరూపించుకుంటూ వరుస సినిమాలకు కమిట్ అవుతూ వస్తోంది ఈ ముద్దుగుమ్మ.టాలీవుడ్ గ్లామర్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న రకుల్.. ఆ తర్వాత బాలీవుడ్ తెరపై కాలుమోపి అక్కడ కూడా తన అందాల రుచి చూపించింది. బీ టౌన్ ప్రేక్షకులు సైతం రకుల్ అందాలకు ఫిదా అయ్యారు.దక్షిణాది తెరపై ఉన్నంత వరకూ కాస్త బొద్దుగానే కనిపించిన ఈ భామ.. బాలీవుడ్‌లో అవకాశం వచ్చిన తరువాత జీరోసైజుకి మారిపోయింది.

సన్నబడి నాజూకుగా అందాలు ఆరోబోస్తోంది.రకుల్ జీరో సైజు చూసి ఈ అమ్మడు బాగా డైటింగ్ చేసినట్లుంది, అందుకే ఇంత సన్నబడింది అనుకున్నారంతా. కానీ నిజానికి అలా జరగలేదట. ఆ సీక్రెట్ రకుల్ స్వయంగా వెల్లడించింది.తనకు డైటింగ్‌ అంటే ఏంటో కూడా తెలియదని చెప్పి షాకిచ్చింది రకుల్. నోరు కట్టేసుకుని కడుపు మాడ్చుకోవడం తనకు అస్సలు ఇష్టం ఉండదని నిర్మొహమాటంగా చెప్పేసింది.నచ్చినవి కడుపునిండా తినేసి ఆ తరువాత తీరిగ్గా వర్కవుట్లు చేస్తానని అంటోంది రకుల్. తను మునుపటి కన్నా సన్నగా మారడానికి వర్కవుట్లే కారణం తప్ప డైటింగ్‌ కాదని తెగేసి చెప్పేసింది ఈ ముద్దుగుమ్మ.రకుల్ ప్రీత్ సింగ్ కి టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ అంటే క్రష్. ఈ విషయాన్నీ ఆమెనే స్వయంగా వెల్లడించింది. హీరోల్లో విజయ్ దేవరకొండ అంటేనే క్రష్ ఉంటుందని తెలిపింది.ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో కాబోయే వాడు ఎలా ఉండాలో కూడా చెప్పింది రకుల్ ప్రీత్ సింగ్. తనతో జీవితం పంచుకునే వాడు కనీసం ఆరడుగులైనా ఉండాలని తెలిపింది.


హైట్‌తో పాటు తెలివైన వాడై కూడా ఉండాలని చెప్పింది రకుల్. అలాంటి క్వాలిటీస్ ఉన్న వరుడు దొరికితేనే తాను పెళ్లి చేసుకుంటానని.. లేదంటే దొరికేదాకా వెయిట్ చేస్తానని రకుల్ తన మనసులోని మాట బయటపెట్టింది.ఇక రకుల్ సినిమాల విషయానికొస్తే.. టాలీవుడ్‌లో ఇటీవలే నాగార్జున సరసన ‘మన్మథుడు 2’లో రొమాన్స్ చేసింది. ఇప్పుడు ‘భారతీయుడు 2’ సినిమాలో కమల్ హాసన్ సరసన నటిస్తోంది. అలాగే బాలీవుడ్‌లో ‘మర్జవా’ చిత్రంలో నటిస్తోంది.