కలిసి తిరిగేస్తే చాన్స్ లు వచ్చేస్తాయా..? మండి పడ్డ రకుల్

టాలీవుడ్‌లో ఒక రేంజ్‌లో హ‌వా న‌డుపుతున్న స్టార్ హీరోయిన్స్ అంటే ఈ మ‌ద్య కాలంలో కాస్త త‌క్కువ‌య్యార‌నే చెప్పాలి. ఒక్కో సంద‌ర్భంలో ఒక్కో హీరోయిన్ హ‌వా కొన‌సాగుతుంది. మొన్నటి వరకు రకుల్ హవా బానే ఉండేది. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ఇప్పుడు రకుల్ కు అవకాశాలు తగ్గాయి. దాంతో ఆమె టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి వెళ్లి అక్కడ త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుటుంది. ఇక తెలుగులో హీరోయిన్ రకుల్ ఇప్పటికే చాలా మంది హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.ఇక ప్రస్తుతం ఆమె నితిన్ సరసన చదరంగం అనే సినిమాలో నటిస్తోంది.ఈ సినిమాకి చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వం వహిస్తున్నారు.

అయితే స్టార్ హీరోల సరసన ఛాన్సులు రాకపోవడంపై రకుల్ స్పందించింది. అందరితో ఫ్రెండ్లీగా ఉంటారు.. కలిసి పార్టీలు కూడా చేసుకుంటారు కదా మీకు ఎందుకు ఛాన్సులు రావడం లేదన్న ప్రశ్న రకుల్ కు ఎదురైంది. దీనికి ఆమె ఆసక్తికరమైన జవాబు ఇచ్చింది.కలిసి తిరిగినంత మాత్రన.. కలిసి పార్టీలు చేసుకున్నంత మాత్రాన ఛాన్సులు వస్తాయి అనుకోవడం తెలివి తక్కువతనం అని చెప్పింది. కథకు తాము సరిపోతాం అనుకున్నప్పుడే దర్శక నిర్మాతలు ఛాన్సులు ఇస్తారని.. పార్టీలకు పిల‌వ‌డంతోనే ఆఫ‌ర్స్ వ‌స్తాయ‌ని అనుకోకూడ‌ద‌ని తెలిపింది. ఆ పాత్ర మనకోసమే పుడితే.. పార్టీలకు వెళ్లకున్న ఆఫర్ ఇస్తారని చెప్పింది. ఫంక్ష‌న్స్‌, పార్టీలు వేరు సినిమాల్లో అవ‌కాశాలు రావ‌డం వేరు అంద‌రూ అన్ని పాత్ర‌ల‌కు సెట్ అవ్వ‌రు ఏ ద‌ర్శ‌కుడికైనా ఆ పాత్ర‌కి మ‌నం సరిపోతాం అన్న ఆలోచ‌న ఉంటే త‌ప్ప‌కుండా మ‌న‌కు ఆఫ‌ర్ ఇవ్వ‌కుండా ఉండ‌రు అని స్పష్టంగా తెలిపింది.

ఇకపోతే కమల్‌తో చేస్తున్న ‘భారతీయుడు 2′ కోసం ఎంతో ఎగ్జైటింగ్‌గా ఎదురుచూస్తుంది ఈ భ‌మ‌. ఇందులో సిద్ధార్థ్‌కి జోడీగా న‌టిస్తోంది. రకుల్‌ తాజాగా నటిస్తున్న హిందీ చిత్రం ‘మర్జావాన్‌’ ఈ నెల 15న విడుదల కానుంది. “ఇందులో ర‌కుల్ ఆర్జేగా న‌టిస్తోంది. సెక్స్‌ అప్పీల్‌ ఉన్న పాత్ర . ‘ముకుద్దార్‌ కా సికందర్‌’ చిత్రంలో రేఖ పాత్రలా ఉంటుంది. రేఖ‌ను మ‌రిపించేలా ర‌కుల్ న‌టిస్తుందా లేదా అన్న‌ది అంద‌రూ వేచి చూడాలి.