రకుల్ కి స్టార్ హిరోతో ఎఫైర్..? ఇండ్రస్ట్రీ అంతా ఇదే చర్చ….

టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ లో ఒకడైన దగ్గుబాటి రానా ఏ హీరోయిన్ తో కనబడితే ఆ హీరోయిన్ తో అతడికి ఎఫైర్ ఉందని రాయడం చాలా కామన్ అయ్యింది. త్రిషతో డేటింగ్ గురించి మీడియా చాలా కథనాలే రాసింది అయితే వాటికీ చిరునవ్వే సమాధానంగా ఇచ్చిన రానా లేటెస్ట్ గా త్రిష ప్లేస్ లో మరో హీరోయిన్ తో డేటింగ్ లో ఉన్నాడని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ రానాకు లింక్ పెట్టి రాసేది ఎవరి గురించి అంటే రకుల్ ప్రీత్ సింగ్ గురించి అన్నమాట.

తెలుగులో స్టార్ హీరోయిన్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న రకుల్ ఈమధ్య కెరియర్ లో చాలా వెనుకపడ్డది. చేతిలో పెద్దగా సినిమాలు కూడా ఏమి లేవు. మహేష్ స్పైడర్ ఆ తర్వాత నాగార్జున మన్మధుడు 2 ఇలా ఈ రెండు సినిమాలు ప్లాప్ అయ్యే సరికి అమ్మడు కెరియర్ దారుణంగా మారింది. ఇక్కడ బిజీగా ఉన్నప్పుడు ఇల్లు కూడా కొన్న రకుల్ ఇప్పుడు అది అమ్మేసి ముంబై చెక్కేసింది తెలుస్తుంది. అయినా సరే రానాతో రకుల్ ఇంకా టచ్ లోనే ఉందని వార్తలు వస్తున్నాయి.మాములుగా హీరో, హీరోయిన్ కలిసి నటిస్తే వాళ్ళ మధ్య ఏదో జరుగుతుంది అని అనుకోవచ్చు.

కానీ రానాతో ఏ హీరోయిన్ అయినా కనబడితే చాలు ఎఫైర్ అంట కట్టేస్తున్నారు. అందుకె ఈ దగ్గుబాటి వారసుడు పెళ్లి చేసుకునే దాకా ఇలాంటి వార్తలు వస్తూనే ఉంటాయి. రానాతో ఎఫైర్ గురించి రకుల్ మాత్రం చాలా లైట్ తీసుకుంది. we are just friends అంతే అంటూ ఆన్సర్ ఇస్తుంది. హైదరాబాద్ లో పక్క పక్క ఇల్లే కావడం వల్ల రానా ఎక్కువ క్లోజ్ అయ్యాడని తనతో పాటుగా మంచు లక్ష్మి కూడా తనకు మంచి ఫ్రెండ్ అంటుంది రకుల్.