రజినీ ఎమోషనల్… అది నా అదృష్టం

రజనీ హీరోగా దర్బార్ వేడుక ఫుల్ జోష్‌తో అభిమానుల కేరింతలతో జరిగింది. రజనీ మాటల కోసం వేడుక ఆసాంతం ఆశగా ఎదురుచూశారు అభిమానులు. టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు, హరీశ్ శంకర్, డైరక్టర్లు హరీశ్ శంకర్, వంశీ పైడిపల్లి, మారుతీ కార్యక్రమానికి వచ్చి వారి సంతోషాన్ని వ్యక్తం చేశారు. జనవరి 9న విడుదల కానున్న ఈ సినిమా గురించి రజినీ అభిమానులతో పాటు మురుగదాస్ అభిమానులు ఎదురుచూస్తున్నారు.ప్రముఖులంతా మాట్లాడిన తర్వాత రజనీకాంత్ మాట్లాడుతూ.. అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

 

ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే ఇంత పెద్ద ఫంక్షన్ అనుకోలేదు. ఎప్పుడూ చిన్నగానే చేస్తూ ఉంటారు. ఈ సినిమా హిట్ అవుతుందని ముందుగానే తెలిసిపోయిందనుకుంటున్నా.1976లో అంతులేని కథ. నా తొలి సినిమా. అప్పట్నుంచి మీ అభిమానం. తమిళ వాళ్లు ఎంత ప్రేమిస్తారో తెలుగు వాళ్లు అంతే ప్రమేంచిచడం నా పూర్వ జన్మ సుక్రతం. మంచి సినిమా ఎప్పుడూ ప్రోత్సహిస్తారు. సినిమా బాగుంది కాబట్టి బాగా ఆడింది కానీ, రజనీకాంత్ ఉన్నాడని కాదు. బాగున్న సినిమాలో రజనీ ఉన్నాడంతే.