రాజమౌళికి అడ్డుపడుతున్న చిరంజీవి.. అసలు కథ ఇదేనా..

రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ మొదలుపెట్టిన దగ్గర నుండి అన్నీ సమస్యలే. ఈ సినిమాకు సంబంధించి ఒక్క షెడ్యూల్ కూడ రాజమౌళి ఆలోచనల ప్రకారంగా జరగడం లేదు. జూనియర్ చరణ్ ల గాయాల దగ్గర నుండి హీరోయిన్స్ సమస్యల వరకు ఈసినిమాను అనేక షాక్ లు వెంటాడుతున్నాయి.ఇలాంటి సమయంలో ఇప్పుడు చరణ్ ‘ఆర్ ఆర్ ఆర్’ కు మరొక ఊహించని సమస్యగా మారబోతున్నాడా అంటూ షాకింగ్ గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం ‘సైరా’ మూవీ రైట్స్ కోసం ఇప్పటికే భారీ మొత్తాలను అడ్వాన్స్ లు గా ఇచ్చిన కొందరు బయ్యర్లు అంతా కలిసి రామ్ చరణ్ ను కలిసినట్లు టాక్.

ఈమూవీ ప్రమోషన్ అంతా చరణ్ ఆద్వర్యంలో జరగాలని అలా అయినప్పుడు మాత్రమే ‘సైరా’ కు అత్యంత భారీ కలక్షన్స్ వస్తాయని అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. అంతేకాదు అవసరం అనుకుంటే దీనికోసం ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ కు రెండు వారలు గ్యాప్ ఇమ్మని కోరినట్లు సమాచారం. అయితే ఈ ఊహించని పరిణామానికి షాక్ అయిన చరణ్ తాను ‘సైరా’ ప్రమోషన్ ను అన్నీ తానై నడిపిస్తాను అని సద్దిచేప్పి బయ్యర్లకు ధైర్యం చెప్పినట్లు తెలుస్తోంది.

దీనికి కొనసాగింపుగా చరణ్ తిరిగి సోషల్ మీడియాలో ముఖ్యంగా ఇన్ స్టా గ్రామ్ లో అకౌంట్ ఓపెన్ చేయడం ఈ అకౌంట్ ను మేనేజ్ చేయడానికి కొంతమంది పిఆర్ వ్యక్తులను ముంబై నుండి ప్రత్యేకంగా రప్పించడం జరిగింది అని అంటున్నారు. ఈ టీమ్ ఆద్వర్యంలోనే ‘సైరా’ ప్రమోషన్ వ్యూహాలు నడిస్తాయని సమాచారం. అయితే ఇలా ‘సైరా’ కోసం చరణ్ ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ కు లీవ్ పెడితే రాజమౌళి అంగీకరిస్తాడా అన్న సందేహాలతో పాటు పరోక్షంగా ‘సైరా’ ప్రమోషన్ ‘ఆర్ ఆర్ ఆర్’ అడ్డతగులుతుందా అన్న ఊహాగానాలు ఇండస్ట్రీ వర్గాలలో హడావిడి చేస్తున్నాయి..