రాజమౌళి రికార్డ్ కే టార్గేట్.. ప్రభాస్ దూకుడు మామూలుగా లేదుగా..!

యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ నటించిన ప్రతిష్టాత్మకంగా రూపొందిన సాహో చిత్రం రిలీజ్‌కు ముందే సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నది. పలు భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రం భారీ ఎత్తున రిలీజ్ అయ్యేందుకు సిద్దమైంది. బాహుబలి తర్వాత ఈ సినిమా వస్తుండటంతో భారీ క్రేజ్ ఏర్పడింది. దేశవ్యాప్తంగా ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. కాగా, ఈ సినిమా రిలీజ్‌కు సంబంధించి ఓ రికార్డును సొంతం చేసుకొన్నది. అదేమిటంటే..

దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి: ది కన్‌క్లూజన్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డు స్థాయి థియేటర్లలో రిలీజైంది. ముఖ్యంగా తమిళనాడులో 525 థియేటర్లలో రిలీజై వసూళ్ల ప్రభంజనం కొనసాగించింది. దక్షిణాదిలోనే బాహుబలి సంచలన విజయం సాధించింది. భాష, ప్రాంతాలకు అతీతంగా ఆదరించడంతో ప్రభాస్ జాతీయస్థాయి నటుడిగా అవతరించారు.బాహుబలి తర్వాత రెండేళ్లు శ్రమించి నటించిన సాహో ఆగస్టు 30న రిలీజ్‌కు సిద్ధమైంది. తమిళనాడులో ఈ సినిమాను భారీగా రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. బాహుబలి తర్వాత అత్యధిక థియేటర్లలో రిలీజ్ అవుతున్న చిత్రంగా సాహో చరిత్రకెక్కింది. ఈ చిత్రం 550 పైగా థియేటర్లలో రిలీజ్‌కు ఏర్పాటు జరుగుతున్నాయి. దీంతో బాహుబలి పేరిట ఉన్న రికార్డు తుడిచిపెట్టుకుపోయింది.

బాహుబలి చరిత్ర సృష్టించిన తర్వాత తెలుగు చిత్రాలకు అన్ని భాషల్లోనూ ఆదరణ విశేషంగా లభించింది. తమిళనాడులో కూడా తెలుగు చిత్రాలకు భారీగా స్పందన లభించింది. ఇటీవల కాలంలో తమిళగడ్డ మీద అర్జున్ రెడ్డి, డియర్ కామ్రేడ్, ఇస్మార్ట్ శంకర్ చిత్రాలు భారీ విజయాన్ని అందుకొన్నాయి. ఇక అందరి కళ్లు సాహో చిత్రంపైనే ఉన్నాయి.సాహో విషయానికి వస్తే హిందీతోపాటు దక్షిణాదిలోని అన్ని భాషల్లోనూ తెరకెక్కింది. తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ కానున్నది. అన్ని రాష్ట్రాల్లోను సాహోను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. ఆగస్టు 30న రిలీజ్ అవుతున్న సాహో ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకొంటుందనే విషయంపై ట్రేడ్ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.