కారు కూడా వదిలేసి పోవటానికి రీజన్ ఇదే.. బయట పెట్టిన రాజ్ తరుణ్..

నార్సింగి రోడ్డు ప్రమాదంపై హీరో రాజ్ తరుణ్ ట్విట్టర్ లో వివరణ ఇచ్చాడు. యాక్సిడెంట్ తర్వాత అదృశ్యమైన రాజ్ తరుణ్ ట్విట్టర్ ద్వారా స్పందించాడు. ప్రమాదం తర్వాత కారు వదిలి పారిపోవడానికి కారణం ఏంటో చెప్పాడు. సాయం కోసమే తన ఇంటి వైపు పరిగెత్తానని తెలిపాడు. 3 నెలలుగా అదే రోడ్డుపై వెళ్తుంటా అని రాజ్ తరుణ్ చెప్పాడు. నిత్యం ఆ రోడ్డులో యాక్సిడెంట్లు జరుగుతుంటాయిని చెప్పాడు. కారు డ్రైవింగ్ సమయంలో సీటు బెల్టు ధరించాను అని తెలిపాడు.

సడెన్ టర్నింగ్ ఉండడంతో కారు అదుపుతప్పి గోడను ఢీకొట్టిందన్నాడు.ఊహించని పరిణామంతో కళ్లు బైర్లు కమ్మాయన్నాడు. భారీ శబ్దం రావడంతో చెవులు మూసుకుపోయాయని, గుండె దడ పెరిగిందని అన్నాడు. సాయం కోసమే ఇంటి వైపు పరిగెత్తాను తప్ప మరో కారణం లేదన్నాడు. తన ఇంటికి దగ్గరలోనే ప్రమాదం జరిగిందన్నాడు. ప్రస్తుతం నేను క్షేమంగా ఉన్నాను అని చెప్పిన రాజ్ తరుణ్.. త్వరలోనే షూటింగ్ లో పాల్గొంటాను అని ట్వీట్ చేశాడు. నార్సింగ్ రోడ్డు ప్రమాదం జరిగింది. రాజ్ తరుణ్ ప్రయాణిస్తున్న కారు డివైడర్ ని ఢీకొట్టింది. ఈ ప్రమాదం నుంచి రాజ్ తరుణ్ సేఫ్ గా బయటపడ్డాడు. యాక్సిడెంట్ తర్వాత కారుని అక్కడే వదిలేసి పరుగులు తీశాడు.

రాజ్ తరుణ్ పరిగెడుతున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. రాజ్ తరుణ్ అలా పారిపోవడం చూసి అనుమానాలు తలెత్తాయి. రాజ్ తరుణ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.