విన్నర్ రాహుల్ బిగ్ బాస్ లో నేర్చుకున్న మూడు అంశాలు ఎంటో తెలుసా..?

అసలు టైటిల్ విన్నింగ్ రేస్ లో లేడు అనుకున్న వ్యక్తి మెల్లగా ఊహించని పరిస్థితుల్లో టైటిల్ విన్నర్ గా నిలిచాడు రాహుల్ సిప్లిగంజ్.సింగర్ గా మొదలు పెట్టిన తన ప్రయాణం ఇప్పుడు సెన్సేషనల్ రియాలిటీ షో అయిన బిగ్ బాస్ టైటిల్ విన్నర్ గా నిలిచారు.అయితే ఖచ్చితంగా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన ప్రతీ ఒక్క కంటెస్టెంట్ కూడా బిగ్ బాస్ కు ముందు ఆ తర్వాత తమలో తాము చాలా మార్పులు గమనించుకున్నామని చెప్పుకొచ్చారు.

అలా పరమ బద్దకాస్త కంటెస్టెంట్ గా మొదలయ్యి బిగ్ బాస్ 3 టైటిల్ గా నిలిచిన రాహుల్ సిప్లిగంజ్ కూడా తనలో తాను కూడా కొన్ని మార్పులను గమనించానని చెప్పారు.కానీ తాను ముఖ్యంగా నేర్చుకున్నవి అయితే మూడు అంశాలు ఉన్నాయని తెలిపారు.”ఓపిక,ప్రవర్తన మరియు ఎలా మాట్లాడాలో” నేర్చుకున్నానని,బిగ్ బాస్ హౌస్ లో అన్ని రోజులు కేవలం కొంతమందితో అలా ఉండాలి అంటే చాలా ఓపిక ఉండాలని అదే కానీ లేకపోతే ఆ ఇంట్లో ఉండడం చాలా కష్టమని తెలిపారు.అంతేకాకుండా తన కోపాన్ని కూడా చాలా తగ్గించుకున్నానని రాహుల్ ఓ ఇంటర్వ్యూ ద్వారా వెల్లడించారు.