రాహుల్ కు చెప్పుచూపించిన పునర్నవి.. అసలు కారణం ఇదే..?

తెలుగు బిగ్‌బాస్ 3 ఇప్పుడిప్పుడే కాస్త రంజు మీదుంటుంది. ఈ కార్యక్రమానికి ప్రధాన ఆకర్షణ వరుణ్ వితిక రాహుల్ పునర్నవి అని చెప్పవచ్చు. భార్యభర్తలయిన వరుణ్ వితికల రొమాన్స్ కాస్త కామన్ అయినా రాహుల్ పున్నుల కెమిస్ట్రీ ప్రేక్షకులను బాగా అలరిస్తుంది. బిగ్‌బాస్ ఇంట్లో రాహుల్ పున్నుల మధ్య చనువు ఎక్కువే అనేది అదంరికి తెల్సిందే. ఈ జంటకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తోంది. రాహుల్ పున్నుల రిలేషన్షిప్ వల్లనే ఈ ఇద్దరు బిగ్‌బాస్ ఇంట్లో స్ట్రాంగ్ కంటెస్టెంట్లుగా మారారని చెప్పవచ్చు. ఇటీవల జరిగిన కెప్టెన్సీ టాస్క్ సందర్భంగా రాహుల్ పునర్నవిల మధ్య గొడవ జరిగింది.

శనివారం నాగార్జున వచ్చాక ఆ గొడవ ఇంకాస్త పెద్దదయింది. పునర్నవిని రాహుల్ మహానటి అనడంతో పున్ను చాలా ఫీల్ అయ్యి ఇక ఫ్రెండ్షిప్ కట్ అనేసింది. ఇక సన్డే ఫన్డే థీమ్‌తో వచ్చిన నాగ్ మళ్లీ రాహుల్‌ను పున్నును రీఛార్జ్ చేయాలని చూశాడు. అందుకే టాస్క్‌లలో ఈ ఇద్దరి మధ్య ఓ చిలిపి సన్నివేశాన్ని క్రియేట్ చేశాడు. ఆదివారం నాడు సరదగా నవ్వించడంలో భాగంగా నాగ్ పున్ను రాహుల్‌లకు టాస్క్ ఇచ్చాడు.ఈ టాస్క్‌లో రాహుల్ పున్ను కోసం కాఫీ షాప్‌లో ఎదురు చూస్తాడు. ఆమె రాగానే ఏం మాట్లాడాలో తెలియక కమ్మలు ఎక్కడ కొన్నావ్ కోఠీలో కొన్నావా? అని అడుగుతాడు. దాంతో పున్ను ఇందుకే పిలిచావా? అంటూ ఘాటుగా సమాధానం ఇచ్చింది. కోపంలో కూడా ఎంత అందంగా ఉన్నావో తెలుసా? తెలియక ముందే ఇంత పొగరుంటే తెలిస్తే ఇంకా ఎంత ఉంటుందో అన్నాడు.ఎందుకు పిలిచావు నాకు చాలా పనులు ఉన్నాయి.

నీకు పది నిమిషాలు టైం ఇస్తున్నా చెప్పాలనుకున్నది చెప్పు అని కండీషన్ పెడుతుంది.ఎందుకు పిలిచానంటే నిన్ను లైన్లో పెట్టడానికి అంటూ చిలిపిగా చెబుతాడు. జుట్టుకు రంగు వేశావా? అనగానే ఒక్కసారిగా ఈ అమ్మడు నవ్వసాగింది. నీ వయస్సు ఎంత ఉంటుంది నీ చెప్పు సైజు ఎంత అని రాహుల్ అడగగా పున్ను నీకు ఒళ్లంతా కొవ్వే బ్రెయిన్లో కూడా కొవ్వే అంటూ చెప్పు చూపించింది.