RRR అప్ డేట్.. చరణ్, తారక్ కలుసుకునేది అక్కడే..?

వెండితెరపై ఒకేసారి అటు మన్యం వీరుడు అల్లూరి కథను, ఇటు గిరిజన వీరుడు కొమరం భీం జీవిత గాథను చూపించబోతున్నారు దర్శకధీరుడు రాజమౌళి. ఆయన నుంచి రాబోతున్న ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ చిత్రంతో ప్రేక్షకులకు ఈ సాహసాన్ని రుచి చూపించబోతున్నారు. ఇప్పుడీ చిత్రం కోసమే ఆదివాసీల పోరాట వీరుడు కొమురం భీమ్‌ పాత్రలోకి ఎన్టీఆర్‌ పరకాయ ప్రవేశం చేయబోతుండగా.. మన్యం వీరుడు అల్లూరి పాత్రలో ఒదిగిపోయేందుకు రామ్‌చరణ్‌ సిద్ధమయ్యారు.

తాజాగా అల్లూరి, కొమ‌రం ఫ‌స్ట్ కాంబినేష‌న్ సీన్‌పై ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. అదేమిటంటే… ప్ర‌మాదంలో ఉన్న ఓ చిన్న పాప‌ని కొమ‌రం(తార‌క్‌) కాపాడ‌డం.. అది చూసి ఇంప్రెస్ అయిన అల్లూరి (చ‌ర‌ణ్‌) అత‌నితో చేతులు క‌ల‌ప‌డం… అనేది సినిమాలో ఫ‌స్ట్ కాంబినేష‌న్ సీన్‌గా ఉంటుంద‌ని టాక్‌. ఆ త‌రువాత వీరిద్ద‌రి పోరు బాట నేప‌థ్యంలో చిత్రం సాగుతుంద‌ని అంటున్నారు. మ‌రి… ఈ వార్త‌ల్లో నిజ‌మెంతో తెలియాలంటే వ‌చ్చే ఏడాది జూలై 30 వ‌ర‌కు ఆగాల్సిందే