పునర్నవితో పెళ్ళిపై రాహుల్ షాకింగ్ ఆన్సర్.. ఇది వింటే పడీ పడీ నవ్వాల్సిందే

లేటెస్ట్ బిగ్ బాస్ తెలుగు సీజన్లో రాహుల్ మరియు పునర్నవిల ట్రాక్ ఎలాంటిదో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా చూసారు.అదే విధంగా ఇదే బిగ్ బాస్ హౌస్ లో ఈ ఇద్దరితో పాటుగా వరుణ్ సందేశ్ మరియు అతని భార్య వితికలతో కలిపి ఆడియన్స్ “పీవీవీఆర్” అనే బ్యాచ్ అంటూ పేరు పెట్టి వారికే సపోర్ట్ ఇవ్వడం మొదలు పెట్టారు.ఒకరిలో ఒకరు బయటకు వచ్చేసినా లోపల ఉన్న ఇద్దరి కోసం కూడా మద్దతు ఇచ్చారు.ఇదిలా ఉండగా ఇప్పుడు ఇదే బ్యాచ్ ను ప్రముఖ యాంకర్ రవి తన ఇంటర్వ్యూకు పిలిచాడు.

అలా చేసిన ఇంటర్వ్యూ స్టార్టింగ్ లోనే బిగ్ బాస్ హౌస్ ను తలపించేలా టచ్ ఇచ్చారు.అలా ఒక ఫోన్ కాల్ టాస్క్ ఇవ్వగా అందులో రాహుల్ తో బిగ్ బాస్ మాట్లాడుతున్నట్టుగా ఒక ప్రశ్న అడిగారు.రాహుల్ నువ్వు పునర్నవి ఒప్పుకుంటే ఆమెను పెళ్లి చేసుకుంటారా అని అడగ్గా రాహుల్ ఇచ్చిన సమాధానం వింటే నవ్వు ఆగదు.బిగ్ బాస్ అలా అడిగిన వెంటనే ఏమాత్రం ఆలోచించకుండా బిగ్ బాస్ నా జీవితాన్ని సంక నాకించే ప్లాన్ లో ఉన్నారా ఏంటి అని అనేశాడు.ఈ సమాధానం వింటే మాత్రం నవ్వు రాక మానదు.బయట అంతా అనుకున్నా నేను అనుకోవాలి కదా అని వీరి పెళ్ళి టాపిక్ కు శుభం కార్డు వేసేశాడు.