పున్నుతో లవ్ ట్రాక్ పై షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన రాహుల్

ఈసారి జరిగిన బిగ్ బాస్ మూడవ సీజన్ రాహుల్ సిప్లిగంజ్ మరియు పునర్నవిల మధ్య జరిగిన నడిచిన ట్రాక్ కు అంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది.ఒకరి మీద ఒకరు ప్రేమను కురిపించుకోవడం,ఏడవడం నవ్వుకోవడం చక్కగా కుదిరిన కెమిస్ట్రీ లాంటి అంశాలు ఈ ఇద్దరి జంటకు ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు.దీనితో బిగ్ బాస్ సీజన్ 3 లో వీరి పార్ట్ ఒక స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.

అయితే ఈ ఇద్దరి మధ్య ఈ ట్రాక్ కేవలం టీఆర్పీ కోసమేనా?ఇదంతా బిగ్ బాస్ అందించిన డ్రామానా?కేవలం వీక్షకులను ఆకట్టుకోవడం కోసమే ఇలా స్క్రిప్ట్ ప్రకారం నడిపించారా అన్న అనుమానాలు కూడా చాలా మందికి వచ్చే ఉంటాయి.ఇలాంటి ప్రశ్నలు అన్నిటికి రాహుల్ ఇప్పుడు సమాధానం ఇచ్చాడు.ఇప్పుడున్న జనానికి ఎవరు ఎలా ఉన్నారు?మంచి చెడులు తెలుసు.అలాంటిది వారిని ఆడుకునే స్టేజ్ లో మేము లేమని హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అంతా నిజాయితీగా ఆడమని కాకపోతే ఫునర్నవి తనకు ఎందుకు దగ్గరయింది అంటే తమ ఇద్దరిది ఒకటే స్వభావం అని ఏదన్నా ముక్కుసూటిగా ఉంటామని అందుకు దగ్గరయ్యింది తప్ప మరోటి లేదని రాహుల్ క్లారిటీ ఇచ్చాడు.