రాహుల్, హిమజ లవ్ ప్రఫోజల్.. పునర్నవి రియాక్షన్ చూస్తే షాకే..?

బిగ్ బాస్ కాలేజ్ టాస్క్ బాగా ఎంటర్ టైన్ మెంట్ సాగింది. బుధవారం ఎపిసోడ్ లో ఇంటి సభ్యులు ఎవరికి వారు తమ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకున్నారు. టీచర్లుగా బాబా భాస్కర్ – వరుణ్ – వితికా అదరగొట్టారు. లవ్ టీచర్ గా బాబా ఫుల్ కామెడీ చేయగా – గాసిప్స్ టీచర్ గా వితికా అదరగొట్టింది. ఈ ముగ్గురు వారికి సబ్జెక్ట్స్ ప్రకారం స్టూడెంట్స్ గా ఉన్న మిగతా ఇంటి సభ్యులకు అర్ధమయ్యేలా చెప్పారు. ఈ క్రమంలో వితికా గాసిప్స్ ఎలా? క్రియేట్ చేయాలని ఒక్కో ఇంటి సభ్యున్ని పిలిచి అడిగింది.ఇక ఒక్కో సభ్యులు వెరైటీగా గాసిప్స్ గురించి చెప్పే ప్రయత్నం చేశారు. అయితే జ్యోతి..మాత్రం వరుణ్ – వితికా జంట హౌస్ లో రొమాన్స్ చేస్తున్నారని చెబుతూ వితికాకే షాక్ ఇచ్చింది.

వరుణ్ సందేశ్ – వితికా బిగ్ బాస్ హౌస్ లో రాత్రి లైట్లు బంద్ చేసిన తరువాత లోపల బెడ్ షీట్ లో ఏమోనట అంటూ చేతిలో ఉన్న పెన్ కి క్యాప్ పెడుతూ.. వితికా వరుణ్ ని బాగా డబ్బులున్నాయనే చేసుకుందట’ అని తనదైన శైలిలో గాసిప్ అల్లేసింది శివజ్యోతి. ఆమె పెట్టిన పుకారుకి తెల్లముఖం వేసిన టీచర్ వితికా.. బాగా చెప్పావ్ అమ్మా.. వెల్ డన్ అంటూ సాగనంపింది.ఈ గాసిప్స్ తర్వాత టీచర్స్ మినహా ఇంటిలోని మగ సభ్యులు…మిగతా మహిళా సభ్యుల్లో ఒక్కరిని ఎంచుకుని లవ్ ప్రపోజల్ చేయాలని బిగ్ బాస్ టాస్క్ ఇచ్చారు. దీంతో మహేశ్ ఒకసారి శివజ్యోతికి…మరొకసారి పునర్నవికి కామెడీగా ప్రపోజ్ చేశాడు. ఆ తర్వాత రవి…శ్రీముఖికు ప్రపోజ్ చేశాడు. అలాగే రాహుల్…పునర్నవిని కాకుండా హిమజని సెలక్ట్ చేసుకుని ఆమెకు లవ్ ప్రపోజ్ చేశాడు. అయితే వీరిలో రాహుల్-హిమజల ప్రపోజల్ బాగుందని టీచర్లుగా ఉన్న బాబా వితికాలు ప్రకటించారు.

దీంతో ఈ జంట ‘మనోహర నా హృదయమునే’ అంటూ రొమాంటిక్ సాంగ్ కు డ్యాన్స్ చేశారు. రాహుల్ కొంచెం మొహమాటం పడ్డ…హిమజ మాత్రం పాటకు తగ్గట్టుగా రొమాంటిక్ డ్యాన్స్ చేసింది. ఆ తర్వాత రాహుల్ కూడా రెచ్చిపోయాడు. ఇక వీరి రొమాన్స్ చూసి పునర్నవి ఎంకరేజ్ చేస్తూ…కేకలు పెట్టింది.