విజయ్ బిగ్ షాక్.. పూరి సినిమాకు బ్రేక్.. ఆ నిర్మాత వల్లే..!

సాధారణంగా ఒక సినిమా హిట్ అయితే ఆ హీరోకి వెంటనే అవకాశాలు వస్తున్నాంటాయి. అలాంటిది వరుసగా నాలుగైదు సినిమాలు విజయాలు సాధిస్తే.. అందులో ఓ మూవీ ఏకంగా వంద కోట్ల క్లబ్ లో చేరితే ఆ హీరో క్రేజ్ మాములుగా ఉండదు. ఇప్పడు టాలీవుడ్ లో వరుస విజయాలు సాధిస్తూ టాప్ హీరో లీస్టులో చేరిపోయాడు విజయ్ దేవరకొండ. పెళ్లిచూపలు, అర్జున్ రెడ్డి, గీతా గోవిందం, టాక్సీవాలా అన్నీ బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమాలే. దాంతో విజయ్ దేవరకొండ తో సినిమాలు తీయడానికి దర్శక,నిర్మాతలు ఉవ్విళ్లూరుతున్నారు.ఎంతటి హీరో అయినా ఒకానొక సందర్భంలో దెబ్బ తినాల్సిందే అంటారు..ఇప్పుడు విజయ్ దేవరకొండ పరిస్థితి అలాగే వుంది.

ఎన్నో అంచనాలు పెట్టుకొని రిలీజ్ అయిన డీయర్ కామ్రెడ్ నిరుత్సాహ పరిచింది. దాంతో తనకు ఇప్పుడు సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు విజయ్ దేవరకొండ.అందుకే తను నటిస్తోన్న సినిమాల విషయంలో కూడా రీఎనాలసిస్ చేసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో ‘హీరో’ సినిమాను ఆపేసినప్పటికీ క్రాంతిమాధవ్ తో చేస్తోన్న సినిమాను మాత్రం వాయిదా వేయడం కుదరలేదు.వాస్తవానికి ఈ మూవీ పోస్ట్ పోన్ చేసి ఇస్మార్ట్ శంకర్ తో సూపర్ హిట్ అందుకున్న పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఓ సినిమాలో కమిట్ అయ్యారు. అయితే క్రాంతి మాదవ్ తో ‘పెళ్లిచూపులు’ సినిమా తరువాత విజయ్ ఒప్పుకున్న కథ ఇది. ఆ తర్వాత అనూహ్యంగా విజయాలు సొంతం చేసుకున్నాడు విజయ్ దేవరకొండ. దాంతో ప్రస్తుతం అతడికున్న ఇమేజ్ కి తగ్గట్లుగా క్రాంతిమాధవ్ సినిమా ఉంటుందా..? లేదా..? అనే విషయం విజయ్ కి కూడా తెలియడం లేదు. ఈ క్రమంలో పూరిజగన్నాథ్ తో సినిమా చేసి ఆ తరువాత క్రాంతి మాధవ్ సినిమాను పూర్తి చేయాలని అనుకున్నాడు. కానీ అందుకు చిత్రనిర్మాత కె.ఎస్.రామారావు అంగీకరించలేదు.

ఇప్పుడు విజయ్ కి ఉన్న ఇమేజ్ బాగుంది..ఒకవేళ సినిమా ఆపితే ఆ ఇమేజ్ బ్రేక్ అవుతుంది..తర్వాత తీసినా సినిమాపై క్రేజ్ తగ్గిపోతుందని అభిప్రాయపడ్డారట. కాబట్టి ఈ సినిమా పూర్తి చేసిన తరువాతే మరో సినిమా చేయాలని ఆయన చెప్పడంతో విజయ్ కి వేరే ఆప్షన్ లేకుండా పోయింది. దీంతో విజయ్ ఈ సినిమా పూర్తి చేసే వరకు ఆగాలని పూరికి చెప్పినట్లు తెలుస్తోంది.