పునర్నవికి దెబ్బేసిన నాగర్జున.. అంతమాట అనేసాడేంటి..?

ఇప్పటివరకు జరిగిన ఎపిసోడ్ లో నాగార్జున ఎప్పుడు లేనంత సీరియస్ గా నిన్నటి ఎపిసోడ్ లో కనిపించాడు. వచ్చి రావటంతో డైరెక్ట్ గా హౌస్ మేట్స్ కి షాక్ ఇస్తూ షూ పాలిష్ చేసుకొని మహేష్ విట్టకి గట్టి కౌంటర్ ఇచ్చాడు. ఆ తర్వాత పునర్నవి విషయం గురించి మాట్లాడుతూ, ఆమె టాస్క్ గురించి మాట్లాడిన బూతులు మ్యూట్ చేపించి మరి నాగార్జున మరోసారి మాట్లాడాడు. ఇవేనా నువ్వు మాట్లాడే మాటలు, టాస్క్ అర్ధం కాకపోతే అది చెప్పే విధానం మరోలా ఉంటుంది కానీ ఈ విధంగా చేయరు. అసలు నీ కోపానికి అర్ధమే లేదు.అయిన రాహుల్ ని ఎప్పుడు టాస్క్ సమయంలో “డోంట్ గివ్ అప్” అని అంటావు కదా..మరి నువ్వేమి చేశావు. గురివింద గింజలాగా ఉన్నావు. పైనున్న ఎరుపు కనిపిస్తుంది.

కింద ఉన్న నలుపు కనిపించటం లేదంటూ నాగార్జున మాట్లాడేసరికి పునర్నవి షాక్ అవుతూ చూస్తుంది పోయింది. అంతకుముందు పునర్నవి గురించి మాట్లాడే ముందు “పునర్నవి గారు” అంటూ నాగార్జున మాట్లాడటం జరిగింది. గతంలో ఒకసారి నాగార్జునతో సీరియస్ గా మాట్లాడుతూ “నాగార్జున గారు” అంటూ వాయిస్ బేస్ మార్చి మాట్లాడింది పునర్నవి. ఆ సమయంలో ఆమె మాట్లాడిన విధానం సరిగ్గా లేదు.దాని గురించి నాగార్జున ఏమి మాట్లాడలేదు అప్పుడు. ఇప్పుడు మాత్రం దానినే హైలైట్ చేస్తూ “పునర్నవి గారు” అంటూ మాట్లాడాడు. ఇక తర్వాత బ్రేక్ టైం లో పునర్నవి శ్రీముఖి వాళ్లతో మాట్లాడుతూ ఏమి చేసిన తప్పు నాదే అంటున్నారు, ఇక నుండి టాస్క్ ని టాస్క్ లగే ఆడుతా..ఎవరేమి అనుకున్న ఇక నేను పట్టించుకోను.. అయిన హౌస్ లో అడ్డమైన వాళ్ళందరూ ఉన్నారు. ఇక్కడ వుండటంకంటే ఇంటికి పోవటమే బెటర్ అంటూ మాట్లాడింది పునర్నవి..ఇవన్నీ బ్రేక్ నుండి వచ్చిన తర్వాత నాగార్జున చూపించటం విశేషం. సాధారణంగా బ్రేక్ మధ్యలో ఏమి జరిగిందో చూపించరు, కానీ నిన్న మాత్రం అది చూపించాడు.