పునర్నవికి ఆ పేరు పెట్టేసారా..? బిగ్ బాస్ ఇలా కూడా జరుగుతుందా..?

బిగ్‌బాస్ మూడో సీజ‌న్ న‌త్త‌న‌డ‌క రేటింగ్‌ల‌తో న‌డుస్తోంది. ఇప్ప‌టికే ఆరుగురు కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు. 100 రోజుల బిగ్‌బాస్ షో ఇప్ప‌టికే 50 రోజులు కంప్లీట్ చేసుకుంది. ఇదిలా ఉంటే బిగ్‌బాస్‌లో ప్ర‌స్తుతం 11 మంది కంటెస్టెంట్లు ఉన్నారు. వీరిలో వ‌చ్చే వారం ఎలిమినేష‌న్లో మొత్తం ఐదుగురు ఉన్నారు. ఇక బిగ్‌బాస్‌లో అందాల రాక్ష‌సి… మోనార్క్‌.. ఎవరి మాట వినదు అని పేరు తెచ్చుకున్న ఏకైక లేడీ పునర్నవి భూపాలం. ప్ర‌స్తుతం ఆమెపై సోష‌ల్ మీడియాలో ఇవే ప‌దాలు వైర‌ల్ అవుతున్నాయి.

బిగ్‌బాస్‌.. ఇచ్చే టాస్క్‌ చేయడానికి ఇంటి సభ్యులు ఎవరూ వెనకడుగు వేయరు. అవసరమైతే మూడు చెరువుల నీళ్లు తాగడానికైనా రెడీ అంటారు. పున‌ర్న‌వి మాత్రం ఏదైనా త‌న‌కు న‌చ్చితేనే చేస్తా… లేకుంటే లేదు అన్న‌ట్టుగా లైట్ తీస్కోంటోంది. ఉన్న‌ది ఉన్న‌ట్టు ముక్కు సూటిగా మాట్లాడ‌డంతో పాటు అందాల రాక్ష‌సిగాను పేరు తెచ్చుకుంది. ఇంట్లోకి వ‌చ్చిన తొలినాళ్ల‌లో అంద‌రిలోనూ క‌లిసేందుకు కాస్త త‌ట‌ప‌టాయించినా ఆ త‌ర్వాత అంద‌రికి మంచి ఫ్రెండ్ అయ్యింది. ఇక రాహుల్ సిప్లిగంజ్ విష‌యంలో ఆమె ప్రేమాయ‌ణం న‌డుపుతున్న‌ట్టు కూడా గాసిప్స్ వ‌స్తున్నాయి. రాహుల్‌కు ఆమె గోరు ముద్దలు తినిపించ‌డం కూడా హాట్ టాపిక్ అయ్యింది. తాజాగా ‘ఇంట్లో దెయ్యం-నాకేం భయ్యం’ టాస్క్‌లో ఏకంగా బిగ్‌బాస్‌కే వార్నింగ్‌ ఇవ్వడంపై సోషల్‌ మీడియాలో భిన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. కొంద‌రు నువ్వు తోపా బిగ్‌బాస్‌కే వార్నింగ్‌లు ఇస్తున్నావా ? అని అంటుంటే మ‌రికొంద‌రు మాత్రం బిగ్‌బాస్ ఇచ్చే చెత్త టాస్క్‌ల‌ను కూడా నువ్వు ఒక్క‌దానివే ఎదురిస్తున్నావంటూ ప్ర‌శంసిస్తున్నారు.

ఇక ఉన్న‌ది ఉన్న‌ట్టు ఓపెన్‌గా చెప్ప‌డమే ఆమెకు ఒక్కోసారి మైన‌స్ అవుతోంది. ఇక ఈ వారం అనూహ్యంగా శ్రీముఖి రాహుల్‌ను కాకుండా పున‌ర్న‌విని నామినేట్ చేయ‌డంతో శ్రీముఖి పున‌ర్న‌విని టార్గెట్ చేస్తున్న‌ట్టుగా క‌నిపిస్తోంది. ఇక ఈ వారం ఆమె ఎలిమినేష‌న్లో ఉన్నా సేఫ్ అవ్వ‌వ‌చ్చ‌ని టాక్‌..?