ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఇలా ట్రై చేయండి.. ఉపాసన కొత్త చిట్కా..!

రామ్ చరణ్ భార్యగా మాత్రమే కాకుండా ఉపాసన తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని ఏర్పరుచుకుంది. సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్ గా ఉంటూ మెగా అభిమానులకు హెల్త్ టిప్స్ ఇవ్వడం ఉపాసన హాబి. దీనికితోడు ఈమె తన అపోలో సంస్థ తరపున బి పాజిటివ్ అనే హెల్త్ మ్యాగజైన్ నిర్వహిస్తున్న ఉపాసన అనేకమంది సెలెబ్రెటీలతో ఇంటర్వ్యూలు చేస్తూ వారి ఆరోగ్య రహస్యాలను అందరికీ షేర్ చేస్తోంది.చరణ్ ఫిట్నెస్ గురించి చిరంజీవి ఆరోగ్యం గురించి ఎన్నో జాగ్రత్తలు తీసుకునే ఉపాసన అనేక సామాజిక కార్యక్రమాలలో కూడ పాల్గొంటూ ఎప్పుడు బిజీగా ఉంటుంది. ఈమెకు చరణ్ లాగే జంతువులు అంటే విపరీతమైన ప్రేమ. చిరంజీవి ఫామ్ హౌస్ నిండా వీరు పెంచే రకరకాల గుర్రాలు కుక్కలు చూడటం కోసం ప్రత్యేకమైన మనుషులు కూడ ఉన్నారు.

తనకు ఈ మధ్య రకరకాల పని ఒత్తిడిలు వల్ల స్ట్రెస్ ఫీలవుతున్న విషయాలను వివరిస్తూ తనకు అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ‘డెక్స్టర్’ వల్ల ఉపసమనం పొందుతున్న విషయాన్ని ఉపాసన వివరించింది. ఇంతకీ ఈ డెక్స్టర్ ఎవరో కాదు ఉపాసన ఎంతో అభిమానంగా పెంచుకునే చిన్న కుక్కపిల్ల.తనలాగే ఎవరైనా టెన్షన్ నుండి రిలీఫ్ పొందాలి అంటే ఎదో ఒక మూగాజీవి పట్ల ప్రేమ పెంచుకోమని సందేశం ఇస్తోంది ఉపాసన. ఇప్పుడు ఈమె ఇచ్చిన సూచనలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. గతంలో కూడ ఉపాసన అనేక ఆరోగ్య చిట్కాలను ఇలాగే మెగా అభిమానులకు షేర్ చేసి వారి మన్ననలను పొందింది. అయితే ఆర్దికమాన్యం ఇండియాను కుదిపేస్తున్న పరిస్థితులలో సామాన్యుడి జీవనమే కష్టమైపోతున్న రోజులలో ఉపాసన సలహాను స్పూర్తిగా తీసుకుని ఎంతమంది మూగ జీవాలను భరించగల శక్తి ఉంటుందో ఆలోచించాలి..