‘సైరా’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు చీఫ్ గెస్ట్ గా ఏవరొస్తున్నారో తెలుసా..?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ సైరా నరసింహారెడ్డి. రాయలసీమ ప్రాంతానికి చెందిన తొలితరం స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా అత్యంత భారీగా తెరకెక్కుతున్న ఈ సినిమాను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ సినిమా, ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. మెగాస్టార్ సరసన ఈ సినిమాలో హీరోయిన్ గా నయనతార నటిస్తుండగా, అమితాబ్ బచ్చన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.

ఇకపోతే ఈ సినిమా ప్రి రిలీజ్ ఫంక్షన్ ని భారీ రేంజ్ లో నిర్వహించేలా సైరా యూనిట్ అప్పుడే ప్లానింగ్ మొదలెట్టిందట. సినిమాకు సంబంధించి వేసిన సెట్స్ మాదిరిగా, ప్రి రిలీజ్ వేడుకలో కూడా వెరైటీ సెట్స్ తో ఫ్యాన్స్ ను థ్రిల్ చేయనున్నారట. అంతేకాక భారీ వ్యయంతో, ఎంతో గ్రాండ్ లెవెల్ లో జరుగనున్న ఈ వేడుకకు చీఫ్ గెస్టులుగా ఇద్దరు స్టార్ హీరోలను కూడా పిలవాలని అప్పుడే నిర్ణయించడం కూడా జరిగిందట. వారు మరెవరో కాదు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అని అంటున్నారు. సెప్టెంబర్ మూడవ వారంలో జరుగనున్న ఈ వేడుకకు ప్రత్యేకంగా హాజరుకావాలని అతి త్వరలో నిర్మాత రామ్ చరణ్ సహా మరికొందరు యూనిట్ సభ్యులు, ఆ ఇద్దరు హీరోలను కలిసి ఆహ్వానించనున్నారని అంటున్నారు.అయితే ఈ వార్తలో ఎంతవరకు నిజానిజాలు ఉన్నాయో తెలియదుగాని, ప్రస్తుతం ఈ న్యూస్ పలు మీడియా మాధ్యమాల్లో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే టీజర్ రిలీజ్ తరువాత, సినిమాపై విపరీతమైన అంచనాలు పెంచిన సైరా, రేపు రిలీజ్ తరువాత తప్పకుండా ఆ అంచనాలు అందుకుంటుందని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

విలక్షణ నటుడు జగపతి బాబు, విజయ్ సేతుపతి, సుదీప్, తమన్నా, నిహారిక కొణిదెల తదితరులు ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు అమిత్ త్రివేది సంగీతాన్ని సమకూరుస్తుండగా, రత్నవేలు ఫోటోగ్రఫీని అందిస్తున్నారు. కాగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి, సినిమాను అక్టోబర్ 2 న రిలీజ్ చేయనున్నారు….!!