ప్రభాస్ కి షాకింగ్ అఫర్…దినికైనా ఒప్పుకుంటాడా…!

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్‌కు బాలీవుడ్‌లోనూ మంచి మార్కెట్ వాల్యూ ఉంది. ‘బాహుబలి’ సినిమాతో ఆయనకు అక్కడ కూడా విపరీతమైన క్రేజ్ ఉంది. ఇక ఇటీవల విడుదలైన ‘సాహో’ సినిమాను కూడా బాలీవుడ్ ప్రేక్షకులు బాగా ఆదరించారు. ఇకనుంచి ప్రభాస్ నటించే సినిమాలు ఏవైనా బాలీవుడ్ ప్రేక్షకులూ చూస్తారన్న నమ్మకం ఏర్పడింది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ నుంచి ప్రభాస్‌కు మైండ్ బ్లోయింగ్ ఆఫర్ వచ్చిందట.

భారతదేశంలోని అతిపెద్ద నిర్మాణ సంస్థల్లో ఒకటైన యశ్ రాజ్ ఫిలింస్ నుంచి ప్రభాస్‌కు పిలుపు వచ్చిందని బాలీవుడ్ వర్గాల సమాచారం. ఈ సంస్థ నుంచి వచ్చిన ‘ధూమ్’ సిరీస్‌లోని మూడు సినిమాలు బ్లాక్ బస్టర్ విజయం అందుకున్నాయి. ఇప్పుడు యశ్ రాజ్ ఫిలింస్ ‘ధూమ్ 4’ ను తెరకెక్కించే పనిలో ఉందట. ఇందులో హీరోగా ప్రభాస్‌ను ఎంపిక చేసుకోవడానికి నిర్మాణ సంస్థ యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.అయితే ఈ ఆఫర్‌కు ప్రభాస్ ఓకే చెప్తాడో లేదో తెలీదు. కానీ ఓకే చేస్తే మాత్రం ఫ్యాన్స్‌కు అంతకంటే పెద్ద పండుగ ఉండదనే చెప్పాలి.

ఎందుకంటే ధూమ్ సిరీస్‌కు ఇండియా వైడ్ పిచ్చి క్రేజ్ ఉంది. ఇప్పటివరకు ఈ సిరీస్‌లో జాన్ అబ్రహం, హృతిక్ రోషన్, ఆమిర్ ఖాన్‌లు నటించారు. ఇప్పుడు ప్రభాస్ నాలుగో సిరీస్‌లో నటిస్తే ఇక ఆయన బాలీవుడ్‌లోనూ దూసుకెళ్లే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ప్రభాస్ ‘జాన్’ సినిమాలో నటిస్తున్నారు. రాధాకృష్ణ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు.