ప్రభాస్ పై శ్రీరెడ్డి పాజిటీవ్ ట్వీట్.. షాకవుతున్న సినీ అభిమానులు

టాలీవుడ్ హీరోయిన్ శ్రీరెడ్డి ఏది చేసినా సంచలనమే అవుతోంది. తన వ్యవహార శైలితో నిరంతరం అందరి నోళ్లలో నానుతూ ఉంటోంది. ఎంతో మంది హితవు పలికినప్పటికీ శ్రీరెడ్డి ప్రవర్తనలో మార్పు రావడం లేదు. ఆమె కూడా ఎవరో చెప్పింది ఎందుకు వినాలి..? అన్నట్లు ప్రవర్తిస్తూ ఉంటోంది. ఈ క్రమంలోనే వరుస పోస్టులు పెడుతూ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇప్పటి వరకు టాలీవుడ్‌లోని ఎంతో మంది హీరోలపై కామెంట్లు చేసిన ఈ బోల్డ్ బ్యూటీ.. తాజాగా యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్‌పై ఓ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ అవుతోంది.కొద్దిరోజులుగా శ్రీరెడ్డి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. రెండు మూడు సంవత్సరాలుగా ఆమె బాగా ఫేమస్ అయిపోయింది.

దీంతో శ్రీరెడ్డి ఫాలోవర్లు కూడా అరవై లక్షలకు పైగానే ఉన్నారు. ఇక, తాజాగా జరుగుతున్న వ్యవహారాలతో ఆమె చర్చనీయాంశం అవుతోంది. ఈ కారణంగానూ ఆమె ఏదో ఒక పోస్ట్ పెడుతూనే ఉంది. ఈ కారణంగా హాట్ టాపిక్ అయింది.శ్రీరెడ్డి.. కొద్దిరోజులుగా చేస్తున్న పోస్టులు మరీ వివాదాస్పదం అవుతున్నాయి. టాలీవుడ్, కోలీవుడ్‌లోని ఎంతో మంది హీరోలను టార్గెట్ చేస్తూ ఆమె.. ఎన్నో సార్లు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టింది. సీనియర్ జూనియర్ అనే వ్యత్యాసం లేకుండా తరచూ ఏదో ఒక కామెంట్ చేస్తూనే ఉంది. దీంతో ఆయా హీరోల ఫ్యాన్స్ నుంచి విమర్శలు ఎదుర్కొంటోంది.
ఈ బోల్డ్ హీరోయిన్.. హీరోలనే కాదు.. ఎంతో మంది హీరోయిన్లను కూడా టార్గెట్ చేసింది. తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లుగా కొనసాగుతున్న వారిని ప్రత్యేకించి ఫోకస్ చేసింది. వీళ్లను ఉద్దేశిస్తూ తరచూ శ్రీరెడ్డి పోస్టులు పెడుతూనే ఉంటోంది. కొన్ని కొన్ని సార్లైతే ఆమె పోస్టులు మరీ శృతి మించుతున్నాయి. దీంతో ఆమెపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది.ఇప్పటికే ఎంతో మంది టాలీవుడ్ హీరోలపై పోస్టులు పెట్టిన శ్రీరెడ్డి.. తాజాగా యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్‌పై ఫోకస్ చేసింది. ‘ప్రభాస్ ప్రవర్తన చాలా కూల్‌గా, మర్యాదపూర్వకంగా ఉంటుంది. అదే సమయంలో అతడు కూర్చునే విధానం రాయల్‌గా కనిపిస్తుంది. డ్రీమ్ బాయ్.. నిన్ను చూసి గర్వంగా ఫీలవుతున్నాను’ అంటూ ఆ పోస్టులో పేర్కొంది.


శ్రీరెడ్డి ఎంతో మంది హీరోలపై నెగెటివ్ కామెంట్స్ చేసింది. అయితే, మొదటిసారి ప్రభాస్‌పై మాత్రం పాజిటివ్‌గా మాట్లాడింది. అంతేకాదు, అతడిని ‘డ్రీమ్ బాయ్’ అని సంబోధించింది. దీంతో శ్రీరెడ్డికి ప్రభాస్‌పై ఉన్న ఫీలింగ్ సుస్పష్టమైందని పలువురు కామెంట్ చేస్తున్నారు. మరి అతడంటే అభిమానమో.. ప్రేమో తెలియాలంటే ఆమె స్పందించాలి.