ప్రభాస్ అప్పుడు చుక్కలు చూసాడంట…?

ఏకంగా ఐదేళ్ల పాటు గెడ్డాలు, కోర మీసాలు, పొడుగు జుట్టుతో బాహుబలిగా ప్రబాస్‌, భళ్లాలదేవగా రానా సందడి చేశారు. పాపం వారికి విసుగు పుట్టిందో లేదో కానీ, వాళ్లని అలా చూసినందుకు ఫ్యాన్స్‌కి తెగ విసుగొచ్చేసిందనుకోండి. అఫ్‌కోర్స్‌ రానా సంగతి అటుంచితే, పాపం ప్రబాస్‌కి కూడా అలాగే అనిపించిందట. అందుకే ‘బాహుబలి’ సినిమా తర్వాత మళ్లీ ప్రబాస్‌ని గెడ్డంతో కానీ, పొడుగు జుట్టుతో కానీ చూడలేదు. ఇక ఇప్పట్లో అలాంటి గెటప్‌లో కనిపించకూడదని అనుకుంటున్నాడట. ఆ సినిమా తర్వాత పూర్తిగా డార్లింగ్‌ లుక్స్‌లోకి మారిపోయాడు ప్రబాస్‌. నీట్‌ షేవ్‌తో లవ్‌లీ హెయిర్‌ స్టైల్‌తో ఆకట్టుకుంటున్నాడు.

‘బాహుబలి’ తర్వాత ప్రబాస్‌ నటించిన ‘సాహో’లో హ్యాండ్‌సమ్‌ లుక్స్‌తోనే కనిపించాడు. కానీ, ఆ సినిమా భారీగా నిరాశపరిచింది ప్రబాస్‌ని. ఇక ప్రస్తుతం ప్రబాస్‌ ‘జాన్‌’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ‘జిల్‌’ ఫేమ్‌ రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ప్రబాస్‌, బ్యూటిఫుల్‌ పూజా హెగ్దేతో ఆన్‌ స్క్రీన్‌ రొమాన్స్‌ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్‌ జరుగుతోంది కానీ, ఎంతవరకూ వచ్చిందనే అప్‌డేట్‌ అయితే ప్రస్తుతానికి లేదు. కానీ, అతి త్వరలోనే మ్యాజికల్‌ సర్‌ప్రైజ్‌ ప్రబాస్‌ నుండి రానుందని తెలుస్తోంది. న్యూ ఇయర్‌ సందర్భంగా సెలబ్రేషన్స్‌తో సందడి సందడిగా ఉన్న ప్రబాస్‌ అండ్‌ కో త్వరలోనే ఆ విషయంలో క్లారిటీ ఇవ్వనున్నారట.

Recommended For You

Leave a Reply

Your email address will not be published.