ప్రభాస్ ప్లానింగ్ సూపర్.. హిందీ మీడియాను భలే మ్యానేజ్ చేస్తున్నాడుగా..!

డార్లింగ్ ప్రభాస్ – శ్రద్దా కపూర్ జంటగా సుజీత్ దర్శకత్వం వహించిన `సాహో` రిలీజ్ ప్రమోషన్స్ పీక్స్ కి చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ 20 రోజులు ప్రభాస్- శ్రద్ధాతో పాటుగా చిత్రబృందం విరివిగా ప్రచార కార్యక్రమాలతోనే బిజీగా ఉండనుంది. ఇటీవలే ముంబైలో రెండ్రోజుల పాటు ప్రభాస్ ఫుల్ గా ఇంటర్వ్యూలతో బిజీబిజీగా గడిపేశాడు. ఓ వైపు ట్రైలర్ ఆవిష్కరణ చేశాక.. మరోవైపు ఇంపార్టెంట్ ముంబై మీడియాలన్నిటినీ కవర్ చేసేశాడట. తాజాగా అందులోంచి ప్రఖ్యాత జర్నలిస్ట్ అనుపమ్ చోప్రాతో ఇంటర్వ్యూ బయటికి వచ్చింది.ఆ ఇంటర్వ్యూ ఆద్యంతం డార్లింగ్ ప్రభాస్ ఎంతో సిగ్గుపడుతూ కనిపించాడు. అంతేకాదు.. తనకు ఎలానూ హిందీ రాదు కాబట్టి ఆ సంగతిని ముందే యాంకర్ కి చెప్పేశాడు.

బాహుబలి టైమ్ లోనూ ఇలానే ప్రభాస్ చాలానే భాష పరమైన ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అప్పట్లో తెలివిగా ముంబై మీడియాని మ్యానేజ్ చేసేశాడు. మరోసారి ప్రభాస్ సిగ్గు ఒలకబోస్తూనే ఆంగ్లంలో మాట్లాడి మ్యానేజ్ చేసేస్తున్నాడని ఈ ఇంటర్వ్యూ చూస్తే అర్థమైంది. ఇక అదే ఇంటర్వ్యూ బాలీవుడ్ స్టార్లు అయితే హిందీలోనే కంటిన్యూ చేస్తారు. కానీ ప్రభాస్ ని పూర్తిగా ఆంగ్లంలోనే ఇంటర్వ్యూ చేశారు సదరు జర్నలిస్ట్.అంతేకాదు.. సాహో గురించి రకరకాల రహస్యాల్ని ఆ ఇంటర్వ్యూలో రివీల్ చేశాడు ప్రభాస్. ఈ చిత్రంలో ఒక పాటను పింక్ లేక్ బ్యాక్ డ్రాప్ లో చిత్రీకరించారు. ఆ విజువల్స్ వండర్ ఫుల్ అంటూ ఆడియెన్ కితాబిచ్చారు. పింక్ సరస్సులో నీరంతా పింక్ వర్ణంలో అద్భుతంగా కనిపిస్తుంది. అది ఒరిజినల్ గా ఆస్ట్రేలియాలో ఉందని చెప్పాడు ప్రభాస్. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాల్ని రియలిస్టిక్ గా చేశామని అయితే బిగ్ సెటప్ ఉందని తెలిపాడు.అలాగే `బాహుబలి -1` సమయంలనే సుజీత్ తనకు సాహో స్క్రిప్టు చెప్పాడని .. కథ కంటే స్క్రీన్ ప్లే గురించి స్పష్టంగా చెప్పడం నచ్చిందని ప్రభాస్ చెప్పారు.

సాహో స్క్రీన్ ప్లే బేస్డ్ సినిమా. కమర్షియల్ సినిమా కూడా. అన్ని భాషల్లోనూ వర్కవుటవుతుందని భావించామని వెల్లడించారు. అంతేకాదు బాహుబలి-1 రిలీజై అంత పెద్ద హిట్టయ్యాక తనకు హార్ట్ ఎటాక్ వచ్చినంత పనైందని ప్రభాస్ ఆ ఇంటర్వ్యూలో వెల్లడించారు. బద్ధకంగా ఉండడం.. సిగ్గు పడడం.. జనాల్ని కలవకలేకపోవడం ఇవన్నీ తన వీక్ నెస్ అని డార్లింగ్ ప్రభాస్ తనకు తానుగానే అంగీకరించాడు.