సంపూనే 2 లక్షలు ఇచ్చాడు.. మీరెంత ఇచ్చినట్టు.. ప్రభాస్ కు షాకిచ్చిన రిఫోర్టర్

ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ‘సాహో’ ఆగస్టు 30న విడుదలవుతున్న నేపథ్యంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వివిధ రాష్ట్రాలు తిరుగుతూ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. శుక్రవారం ఆయన బెంగుళూరులో మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా రిపోర్టర్స్ అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానం ఇచ్చారు. మీ పెదనాన్న కృష్ణం రాజుగారు చాలా డివోషనల్ మూవీస్ చేశారు. మీ నుంచి భక్త కన్నప్ప లాంటి మూవీస్ ఆశించవచ్చా? అనే ప్రశ్నకు ప్రభాస్ రియాక్ట్ అవుతూ…. ‘తప్పకుండా చేస్తాను, భక్త కన్నప్ప కన్నడలో మొదట వచ్చింది. రాజ్ కుమార్ సర్ చేశారు. తెలుగులో బాపుగారు డైరెక్టర్ చేసిన భక్త కన్నప్ప నా ఫేవరెట్ ఫిల్మ్. తప్పకుండా అలాంటి సినిమాలు చేస్తాను.’ అన్నారు.

బాహుబలి తర్వాత లవ్ స్టోరీ చేయాలనుకున్నాను. కానీ స్క్రిప్టు కదరలేదు. సుజీత్ చెప్పిన స్క్రిప్టు నచ్చడంతో ‘సాహో’ చేశాను. బాహుబలి తర్వాత ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉంటాయి. దానికి తగిన విధంగానే ‘సాహో’ క్వాలిటీగా తెరకెక్కించాం. అందుకే బడ్జెట్ కూడా ఎక్కువ అయిందని తెలిపారు.మధ్యలో కొందరు లేడీ అభిమానులు మైక్ అందుకుని ప్రభాస్ అన్నయ్యా… మీ పెళ్లికి ఎప్పుడు పిలుస్తారు? వదినను మాకు ఎప్పుడు పరిచయం చేస్తారు? అనే ప్రశ్నకు రియాక్ట్ అవుతూ…. ‘తెలియదు’ అంటూ నవ్వుతూ సిగ్గుమొగ్గలేశారు యంగ్ రెబల్ స్టార్.‘సాహో’ అంటే అర్థం ఏమిటి? ఎందుకు ఈ టైటిల్ పెట్టారు? అని ఒకరు ప్రశ్నించగా… ‘సాహో’ అనేది సంస్కృత పదం. సాహో అంటే జైహో లాంటి మీనింగ్ వస్తుంది. ఒక ఆసక్తికర విషయం చూపించబోతున్నాం కాబట్టి ఇలాంటి టైటిల్ పెట్టామని ప్రభాస్ తెలిపారు.తప్పకుండా చేస్తాను. ఛత్రపతి తర్వాత డార్లింగ్ చేశాను, మిస్టర్ పర్ఫెక్ట్ చేశాను. సాహో తర్వాత లవ్ స్టోరీ చేయబోతున్నాను. మేము ఎప్పుడూ మంచి స్క్రిపు కోసం ఎదురు చూస్తుంటాం. అన్ని రకాల సినిమాలు చేస్తానని ప్రభాస్ తెలిపారు. ఆల్రెడీ లవ్ స్టోరీతో తర్వాతి సినిమా షూటింగ్ మొదలైంది. 20 రోజుల షూటింగ్ కూడా జరిగింది. ఇది కూడా ప్యాన్ ఇండియా సినిమా కానీ యాక్షన్ మూవీ కాదన్నారు.ఫిట్‌నెస్ అనేది సినిమా సినిమాకు మారుతుంది. బాహుబలి సమయంలో కండలు పెంచడానికి చాలా జంతువులను తిన్నాను. తర్వాత మజిల్స్ తగ్గించుకోవడానికి సాహో సమయంలో వెజిటేరియన్‍గా మారాను, చాలా జంతువులను సేవ్ చేశాను అని ఓ ప్రశ్నకు ప్రభాస్ సమాధానం ఇచ్చారు.

సంపూర్ణేష్ బాబు నార్త్ కర్నాటక వరద బాధితులకు రూ. 2 లక్షల విరాళం ఇచ్చారు. మీకు ఇక్కడ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, మీ సినిమాలు కూడా బాగా ఆడతాయి. మీరు ఎలాంటి సహాయం చేస్తారు? ఏమైనా చేశారా? అనే ప్రశ్నకు ప్రభాస్ స్పందిస్తూ… ‘‘ఐ విల్ డూ మై బెస్ట్.. తప్పకుండా చేస్తాను. ఇలాంటివి జరిగినపుడు నేను సహాయం చేస్తూనే ఉన్నాను.” అన్నారు.అనుష్కకు, మీకు మధ్య లవ్ ఎఫైర్ ఉన్నట్లు, పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. నిజమేనా? అని ఈ సందర్భంగా కొందరు ప్రశ్నించగా…. ఆ వార్తలు క్రియేట్ చేసింది మీరే, దానికి సమాధానం కూడా మీరే చెప్పాలి అంటూ ప్రభాస్ వ్యాఖ్యానించారు.