అఖిల్ కు నో చెప్పిన పూజా హెగ్డే.. అసలు కారణం ఇదే..?

అక్కినేని నాగార్జున తనయుడు అఖిల్ హీరోగా నాలుగో సినిమా కష్టాలు ఇప్పట్లో తీరేలా లేవు. మొదటి మూడు సినిమాలు ”అఖిల్, హలో, మిస్టర్ మజ్ను” ఆశించిన ఫలితం రాబట్టక పోవడంతో కనీసం నాలుగో సినిమాతోనైనా బ్రేక్ తెచ్చుకోవాలని కసిగా ఉన్న అఖిల్ ఈ సినిమాలో హీరోయిన్ విషయమై స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. అత్యంత జాగ్రత్తగా, సినిమాకు పాజిటివ్ అయ్యే హీరోయిన్‌ని సెలెక్ట్ చేయాలని భావించిన ఆయన పూజా హెగ్డే వైపు మొగ్గు చూపాడని తెలిసింది.

పూజా హెగ్డేతో సంప్రదింపులు జరిపిన చిత్రయూనిట్ ఆమెను ఫైనల్ చేశారని కూడా వార్తలు వచ్చాయి. త్వ‌ర‌లోనే ఆమె సెట్స్‌లో జాయిన్ అవుతుంద‌ని కూడా అన్నారు. కానీ తాజాగా అందిన సమాచారం మేరకు పూజా హెగ్డే ఈ సినిమాలో నటించనని తేల్చి చెప్పిందట. ఆమె డిమాండ్ చేసినంత రెమ్యున‌రేష‌న్ ఇచ్చేనందుకు చిత్ర యూనిట్ సుముఖంగా లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం అని తెలుస్తోంది.

దీంతో నిర్మాత‌లు మ‌రో హీరోయిన్‌ను తీసుకోవాల‌నుకుంటున్నార‌ని టాక్‌. ఆకాశ్ పూరి చిత్రం రొమాంటిక్‌ ఫేమ్ కేతికా శ‌ర్మ పేరు ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్లు స‌మాచారం. ఈ విషయమై త్వరలోనే నిర్ణయం తీసుకొని అధికారికంగా వేళలాడిస్తారట. ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైన ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ఫ్యామిలీ సెంటిమెంట్‌తో ఈ సినిమా రూపొందిస్తున్నారని తెలిసింది. పైగా ఈ సినిమాకు ఓ క్యాచీ టైటిల్ కూడా ఫైనల్ చేశారని సమాచారం. అతిత్వరలో సినిమాకు సంబందించిన మరిన్ని వివరాలు ప్రకటించనున్నారు.