పూజా పాప.. కాస్త ఏక్కువగానే డిమాండ్ చేస్తుందే…?

టాలీవుడ్ లో ఇప్పుడు పూజ హెగ్డే హవా ఎక్కువగా నడుస్తుంది. ఆమె తో సినిమా చేయడానికి ఎందరో దర్శక నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. టాలీవుడ్ జనాలకు ఆమె ఇప్పుడు లక్కీ హీరోయిన్. ఆమె సినిమా చేసింది అంటే కచ్చితంగా హిట్ అవుతుంది అనే భావనలో టాలీవుడ్ హీరోలు కూడా ఉన్నారు. అందుకే ఆమె ఎంత డిమాండ్ చేసినా సరే నిర్మాతలు ఇవ్వడానికి ముందుకి వస్తున్నారు. ఆమె కూడా చాలా జాగ్రత్తగా సినిమాలు చేస్తుంది. టాలీవుడ్ లో ఆమె పారితోషికం చూసి బాలీవుడ్ జనాలు కూడా షాక్ అవుతున్నారట.

ఆమె దాదాపు అగ్ర హీరో సినిమా అయితే పది కోట్ల వరకు డిమాండ్ చేసే పరిస్థితి ఉందని అంటున్నారు. కమర్షియల్ సినిమా అయితే ఆమె ఇలాగే డిమాండ్ చెయ్యాలని చూస్తుంది అంటున్నారు బాలీవుడ్ జనం టాలీవుడ్ జనం. ఆమె పాత్రకు డిమాండ్ ఉంటే ఆమె ఎక్కడా కూడా కథ విషయంలో,.. వెనక్కు తగ్గే అవకాశం లేకపోతే ఇలాగే డిమాండ్ చెయ్యాలి అని చూస్తుంది. ఆమె ప్రస్తుతం మన తెలుగులో రెండు మూడు సినిమాలు చేస్తుంది. బాలీవుడ్ లో కూడా ఆమె రెండు సినిమాలు చేస్తుంది. తమిళంలో కూడా ఆమెకు మంచి ఆఫర్లు వస్తున్నాయి.ఇప్పుడు ఆమె ప్రభాస్ తో చేసే సినిమాకు భారీగా డిమాండ్ చేసినట్టు సమాచారం.

దాదాపు ఆరు కోట్ల వరకు డిమాండ్ చేసింది అనేది టాలీవుడ్ లో ఇప్పుడు ఎక్కువగా వినపడుతున్న మాట. ఇక మరో హీరో తో ఆమె చేసే సినిమాకు మూడు కోట్ల వరకు తీసుకుంటుంది అని టాక్. టాలీవుడ్ హీరోలు కూడా భయపడే పరిస్థితిలో ఈ విధంగా ఆమె డిమాండ్ చేస్తుంది. ఇక కరోనా ఉన్నా సరే ఆమె ఎక్కడా కూడా డిమాండ్ చేసే విషయంలో వెనక్కు తగ్గడం లేదు. తన అవసరం ఉందని గ్రహించి భారీగా అడుగుతుంది అంటున్నారు.