వామ్మో పూజా.. టాలీవుడ్ నే షేక్ చేస్తుందిగా..!

Pooja Hegde : పూజా హెగ్డే.. ‘ఒక లైలా కోసం’ చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించింది. ఆ సినిమా తర్వాత వరుసగా ఆఫర్స్ అందుకుంటూ త‌న స‌త్తా చాటుతుంది. అందులో భాగంగా స్టార్ హీరోల స‌ర‌స‌న వ‌రుస ఆఫ‌ర్స్ అందుకుంటూ స్టార్ ఇమేజ్‌ను సంపాదించుకుంది. పూజా హెగ్డే ఇటీవల మహేష్ బాబు హీరోగా వచ్చిన ‘మ‌హ‌ర్షి’ చిత్రంతో అభిమానుల‌ని అల‌రించిన సంగతి తెలిసిందే. ఆమె తాజా సినిమా ‘గద్దలకొండ గణేష్’ చిత్రం ఇటీవలే విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం పూజా.. అల్లు అర్జున్ ‘అల‌.. వైకుంఠ‌పుర‌ములో’, హిందీ సినిమా ‘హౌజ్‌ఫుల్ 4’, రెబల్ స్టార్ ప్ర‌భాస్‌ రాధాకృష్ణ చిత్రాల‌తో బిజీగా ఉంది. తాజాగా ఈ అమ్మ‌డుకు మరో అవకాశం లభించింది. అక్కినేని అఖిల్ నాల్గొవ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తోంది. బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు.

అయితే ఈ రంగుల ప్రపంచంలో.. అవకాశాలు ఉన్నంతవరకు బాగానే ఉంటుంది.. కానీ ఒకసారి గనుక వారికున్న ఇమేజ్, పాపులారిటీ వంటివి తగ్గిపోతే ఇక్కడ నెగ్గుకు రావడం కష్టమే. ఈ రంగుల ప్రపంచంలో హీరోయిన్ల కంటే హీరోలకు చాలా కాలం లైఫ్ ఉంటుంది. అయితే వారి సరసన నటించే హీరోయిన్లకు రెండు మూడు ఏళ్లకే వారి కెరీర్ అయిపోతుంది. దానితో సపోర్టింగ్ రోల్స్ తో అలరించడానికి సిద్ధమవుతారు. అయితే.. తెలుగు సినీ పరిశ్రమలో నటీమణులకు కొదవే లేదు… ప్రస్తుతం హీరోయిన్ అంటే గ్లామర్‌కు మారు పేరు అన్న విషయం తెలిసిందే. అటు గ్లామర్ ఇటు నటన రెండింటినీ సమన్వయ పరచుకుంటున్నారు నేటి తరం తారలు.

మరి ఇలా తనను తాను సమన్వయ పరుచుకుంటూ టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బెస్ట్ ఆప్షన్‌గా మారింది కన్నడ భామ పూజా హెగ్డే. ఇప్పుడున్న మన తెలుగు యంగ్ హీరోలకు సరైన జోడీ అనిపించుకుంటూ డిమాండ్ అంతకంతకూ పెంచుకుంది పూజా. అందం, అభినయం పరంగా నేటితరం హీరోయిన్లలో తానూ ప్రత్యేకం అని నిరూపించుకుంది. దీంతో ఆమెనే కావాలని కోరుకుంటున్నారు స్టార్ హీరోలు. ఇదిలావుంటే నేటి తరం ప్రేక్షకులు కోరుకునే విధంగా అందాల ప్రదర్శనకీ అడ్డు చెప్పకపోవడం, డేట్ల విషయంలో మరీ కచ్చితంగా ఉండకపోవడం ఆమెకు కలిసొస్తున్న అంశాలని తెలుస్తోంది. సరైన సమయానికి షూటింగ్ స్పాట్ కి రావడం కూడా పూజాకీ ప్లస్‌‌ అవుతోందట. మరి దర్శక నిర్మాతలుకూడా ప్రస్తుతం పూజా డిమాండ్ చూసి ఆమెకు ఎంతైనా ఇచ్చేందుకు రెడీ అవుతున్నారట. ఎలాగైనా తమ సినిమాలో ఆమెనే హీరోయిన్ గా ఉండాలని అనుకుంటున్నారట. ఈ మేరకు ఆమె అడిగిన పారితోషకాన్ని కూడా ఇచ్చి ఓకే అనిపిస్తన్నట్టు సమాచారం.