ఆ సమయంలో చాలా భయపడ్డా..పూజాహెగ్డే కామెంట్…

పూజా హెగ్డే.. మెగా హీరో వరుణ్ తేజ్ సరసన ‘ముకుంద’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన విషయం తెలిసిందే. ఆ సినిమా తర్వాత వరుసగా తెలుగులో అవకాశాలు అందుకుంటూ.. చాలా బీజీగా ఉన్న హీరోయిన్‌లో ఒకరుగా రాణిస్తోంది. తెలుగులో టాప్ హీరోలందరితో ఆడిపాడింది పూజా. అల్లు అర్జున్ సరసన ‘డీజే’ లోహాట్‌గా అదరగొట్టిన ఈ భామ.. ఎన్టీఆర్‌తో ‘అరవింద సమేత’లో క్యూట్‌గా మైమరిపించింది. తర్వాత ఇటీవలే మహేష్‌ బాబుతో కలసి ‘మహర్షి’లో చేసి మంచి హిట్ అందుకుంది. తాజాగా వరుణ్‌తో మరో సారి ఆడిపాడింది. గద్దలకొండ గణేష్‌గా వచ్చిన ఈ సినిమాలో అలనాటి శ్రీదేవి హిట్ సాంగ్ ‘ఎల్లువొచ్చి గోదారమ్మ ఎల్లాకిల్లా పడ్డాదమ్మో’ అనే పాటలో అదరగొట్టింది ఈ జంట.

 

వరుస హిట్లతో ఊపు మీద ఉన్న ఈ ముద్దుగుమ్మ తాజాగా ఇంగ్లీష్ మీడియాతో మాట్లాడుతూ.. ముద్దు సన్నివేశాలపై స్పందించింది. సినిమాల్లో ముద్దు సీన్లలో నటించే సందర్భాల్లో చాలా ఇబ్బందులు పడుతుంటామని పేర్కొంది. దానికి ఉదాహరిస్తూ.. ‘మొహంజోదారో’ సినిమాలో హృతిక్‌ రోషన్‌కు ముద్దుపెట్టిన సీన్‌ను గుర్తు చేసుకుంది. ఆమె మాట్లాడుతూ.. ‘ముద్దు సన్నివేశాలు వెండితెరపై చూసేందుకు ప్రేక్షకులకు బాగుంటాయి. కానీ.. ఆ సీన్‌‌లలో నటించేందుకు నటులు ఎంత కష్టపడతారని చెప్పింది. ఈ సినిమాలో హృతిక్‌తో ముద్దు సీన్ ఉందని షూట్‌కు ముందు దర్శకుడు అశుతోష్‌ గోవారికర్‌ నాకు వివరించారని. దీంతో లిప్‌లాక్‌ సీన్‌కు సిద్ధమయ్యాను. అయితే తీరా.. షూట్ చేసే సమయానికి నాకు వణుకు పుట్టిందని తెలిపింది. దానికి ముందు నేను అలాంటి సీన్లు చేయలేదు. మా చుట్టూ చాలా మంది జనాలు నిలబడి ఉన్నారు. నాకు చాలా కష్టంగా అనిపించింది.. అని చెప్పుకొచ్చింది పూజ.

 

పూజా ప్రస్తుతం అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తోన్న ‘అల వైకుంఠపురములో..’ నటిస్తోంది. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 12న విడుదల కాబోతోంది. దాంతో పూజా ప్రస్తుతం ప్రభాస్‌కు జోడీగా ‘జాన్’ అనే సినిమాలో నటిస్తోంది.

Recommended For You

Leave a Reply

Your email address will not be published.