తమన్నా పై పోలిస్ కేస్ పెట్టిన శ్రీరెడ్డి..

తెలుగు ఇండస్ట్రీలో అందరికీ చుక్కలు చూపించడంలో శ్రీ రెడ్డి స్పెషలిస్ట్. ఎవర్ని పడితే వాళ్లను.. ఎప్పుడు పడితే అప్పుడు టార్గెట్ చేస్తూ ఉంటుంది ఈమె. అలాంటి ఈమెను ఇప్పుడు ఓ హీరోయిన్ టార్చర్ పెడుతుంది. వినడానికి విచిత్రంగా అనిపించినా కూడా ఇదే నిజం. కొన్ని రోజులుగా టాలీవుడ్‌లో రచ్చ చేసిన శ్రీ రెడ్డి.. ప్రస్తుతం తన మకాం తమిళనాడులోని చెన్నైలో పెట్టేసింది. అక్కడే ఓ సొంత ఇల్లు కూడా కొనేసింది. దాంతో పాటు న్యూ ఇయర్ లక్ష్యాన్ని కూడా సెట్ చేసుకుంది శ్రీ రెడ్డి. తమిళనాట అవకాశాల కోసం చూస్తున్న నటులకు ఉపాధి కల్పించే పనుల్లో బిజీ అయిపోయింది శ్రీ రెడ్డి.

 

ఈ మేరకు ఫేస్ బుక్‌లో క్యాస్టింగ్ కాల్ కూడా ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.ఇదిలా ఉంటే ఈమె ప్రస్తుతం చెన్నైలో ఉంటున్న ఇంటి ముందు ఒక వెబ్ సిరీస్ షూటింగ్ జరుగుతుంది. ఆ వెబ్ సిరీస్‌లో తమన్నా హీరోయిన్. ఆమె లాంటి స్టార్ హీరోయిన్ నటిస్తుంటే కచ్చితంగా సందడి మామూలుగా ఉండదు. తమన్నా షూటింగ్‌తో గత 15 రోజులుగా తన ఇంటి ముందు రచ్చ జరుగుతుందని.. అది తనకు చాలా ఇబ్బందిగా ఉందని మండి పడుతుంది. తమన్నా షూటింగ్‌కు వచ్చిపోయే వాళ్ళతో తన ఇంటి ముందు పెద్ద జాతర జరుగుతుందని.. దానివల్ల పనులు కూడా చేసుకోలేకపోతున్నాం అంటూ విరుచుకుపడుతుంది శ్రీ రెడ్డి.దాంతో ఏం చేయాలో తెలియక.. లైవ్ వీడియోను పోస్ట్ చేస్తూ తన బాధని చెప్పుకొచ్చింది శ్రీ రెడ్డి. తన ఇంటి ముందు ఉన్నవారంతా తనపై అసభ్యకరమైన కామెంట్స్ చేస్తున్నారని.. వాళ్లకు చెప్పినా వినిపించుకోలేని స్టేజ్‌కి వెళ్ళిపోయారు అంటూ తమన్నా సెక్యురిటీ గార్డ్స్‌పై కారాలు మిరియాలు నూరుతుంది శ్రీ రెడ్డి. ఈ విషయంపై పోలీసులకు కూడా కంప్లైంట్ ఇచ్చింది శ్రీ రెడ్డి. తమన్నా షూటింగ్ జరిగితే ఎవరికి గొప్ప అంటూ ప్రశ్నించింది ఈ కాంట్రవర్సీ క్వీన్.

 

15 రోజులుగా షూటింగ్‌ల పేరుతో తనకు టార్చర్ చూపిస్తున్నారు అంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది శ్రీ రెడ్డి. ఇంటి ముందే అందరూ ఉంటే సొంత పనులు ఎలా చేసుకుంటానని ప్రశ్నించింది. ఒంటరిగా ఉన్న ఆడదాన్ని టార్చర్ పెడుతున్నారని.. తనతో పాటు చుట్టుపక్కల ఉన్నవారు కూడా ఇబ్బంది పడుతున్నారని చెప్పుకొచ్చింది. నువ్వు ఈ వెబ్ సిరీస్‌లో ఫెయిల్ అవుతావ్ తమన్నా అంటూ శాపనార్థాలు కూడా పెడుతుంది ఈమె. మరి దీనిపై తమన్నా ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

Recommended For You

Leave a Reply

Your email address will not be published.