రెండో పోకిరి సిద్దమవుతున్నాడా..? పూరీ ఆ హీరోతోనే చెయ్యబోతున్నాడా..?

మహేష్ బాబు కెరియర్‌లో ఎప్పటికి గుర్తుండిపోయే సినిమా పోకిరి. 2006 లో విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఘనవిజయం సాధించి బాక్సాఫీసు వద్ద ఒక నూతన ఒవరడిని సృస్టించింది అన్న విషయం తెలిసిందే. ఇకపోతే మగధీర చిత్రం విడుదల వరకు ఈ చిత్రం తెలుగు సినిమా చరిత్రలోనే అత్యధిక వసూళ్ళు సాధించిన చిత్రంగా రికార్డులకెక్కింది కూడా.ఒకరకంగా చెప్పాలంటే ‘పోకిరి’ పూరి ఇమేజ్ ని ఎక్కడికో తీసుకు వెళ్లింది.అయితే ఇప్పుడు పోకీరికి సీక్వెల్‌గా పోకిరి 2 స్టార్ట్ అవ్వబోతుందని తెలుస్తుంది. పోకిరిని మించిన స్టోరీ పూరీ రెడీ చేసాడని. ప్రస్తుతం పూరీ. విజయ్ దేవరకొండ, బాలయ్యలతో సినిమాలు చేసిన తర్వాత పూరీ స్టార్ట్ చేయబోయ్యే సినిమా ఇదే అంటున్నారు.

పోకిరి సినిమాకు ఏం తక్కువ కాకుండా తీయబోయే పవర్ పుల్ సబ్జెక్ట్ ఉన్న ఈ సినిమాలో హీరో ఎవరు అనే పశ్న ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే పోకిరి 2 కి మెగా పవర్ స్టార్ రాంచరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటున్నారు.చిరుత తర్వాత రాంచరణ్ మళ్ళీ పూరీ కలసి చేయబోతున్న‌ట్టు స‌మాచారం.ఇక ఈ విషయం తెలిసిన మెగా ఫ్యాన్స్ పుల్ ఖుషిగా వున్నారు..రాంచరణ్..పూరీ కలిస్తే పోకిరి 2 మరో ఇండస్ట్రీ హిట్ అవ్వటం ఖాయం అంటున్నారు.ఈ సినిమా పోకిరిని మించి హిట్ అవ్వడానికి పూరి శ్రమిస్తున్నాడని అంతే కాకుండా పోకిరిలో ఎలాంటి ట్విస్ట్ లు పెట్టి ప్రేక్షకుల్ని కదలకుండా చేసాడో అంతకు మించి ఈ పోకిరి 2 లో కూడ ట్విస్ట్ పెట్టబోతు ఉన్నాడంటున్నాయి సినివర్గాలు.ఇక పూరీ దర్శకత్వంలో రామ్‌ కథానాయకుడిగా వచ్చిన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’విజయం అందుకున్న విషయం తెలిసిందే.

ఔట్ అండ్ ఔట్ మాస్ ఎంటర్టేనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాపై ప్రముఖ హీరో రామ్ చరణ్ ఫేస్‌బుక్ వేదికగా ప్రశంసల ఝల్లు కురిపించాడు. అంతేకాదు దర్శకుడు పూరీ జగన్నాథ్‌తో పాటు..రామ్ నటనను మెచ్చుకున్నారు కూడా. ఇక పోకిరి లాగా పోకిరి 2 ఎన్ని రికార్డ్‌లను బ్రేక్ చేస్తుందో పూరికి ఎంతవరకు బ్రేక్ ఇస్తుందో తెలియాలంటే ఇంకా కొన్నాళ్లు ఆగవలసిందేనట..