పెళ్ళి పీటలెక్కనున్న టాప్ హీరోయిన్.. ప్రెగ్నెంట్ గానే మ్యారేజ్

పెళ్లి తర్వాత కదా మనం గర్భవతి అనే మాట వింటాం. కానీ, అదేంటీ.. త్వరలో పెళ్లి, గర్భవతి అంటున్నారేంటా.? అని ఆశ్చర్యపోనక్కర్లేదులెండి. ఎందుకంటే, అందరికీ ఈ మాట అలవాటైపోయేలా చేసింది అందాల భామ అమీజాక్సన్‌. బ్రిటీష్‌ మూలాలున్న ఈ భామకి మన ఇండియన్‌ సాంప్రదాయాలతో పని లేదు. సో పెళ్లికి ముందే డేటింగ్‌ చేసి, గర్భం కూడా దాల్చింది. ఆ విషయాన్ని అస్సలు దాచి పెట్టకుండా, విచ్చల విడిగా పబ్లిసిటీ చేసేసుకుంది. గర్భవతి అయినాకనే నిశ్చితార్ధం కూడా చేసుకుంది.

ఇక ఇప్పుడు డెలివరీ లోపే పెళ్లి చేసుకోనుంది. అమీజాక్సన్‌ తన ప్రియుడు జార్జ్‌ పనయిటుతో గత కొంత కాలంగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ఆ ప్రేమ కాస్తా డేటింగ్‌ వరకూ వెళ్లడం, డేటింగ్‌ నుండి కన్సీవ్‌ కావడం.. తర్వాత నిశ్చితార్దం, ఇప్పుడు పెళ్లి తన పద్ధతిలో ఓ పద్థతిగా నడిపిస్తోందీ హాట్‌ బ్రిటీష్‌ సుందరి. ప్రెగ్నెన్సీలో కాబోయే భర్తతో కలిసి దిగిన హాట్‌ హాట్‌ పిక్స్‌ సోషల్‌ మీడియాలో చాలానే షేర్‌ చేసింది ఈ బ్యూటీ.

అంతేకాదు, బేబీబంప్‌తో స్పెషల్‌ హాట్‌ ఫోటో సెషన్స్‌ కూడా చేయించుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమెకు సెవెంత్‌ మంత్‌ అట. డెలివరీ లోపే పెళ్లికి రంగం సిద్ధం చేస్తున్నారట అమీజాక్సన్‌ కుటుంబ సభ్యులు. ఇటలీలో ఆమె వివాహానికి ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయట. ఇంకా డేట్‌ ఫిక్స్‌ కాలేదు కానీ, ఆమే చెబుతుందిలెండి పెళ్లి డేట్‌ ఎప్పుడో. అంతవరకూ లెట్స్‌ వెయిట్‌ అండ్‌ సీ.!