పెళ్ళికి సిద్దమైన బెల్లంకొండ.. ఆ అమ్మాయి ఎవరంటే..!

ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్ కుమారుడు యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ త్వరలోనే ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా చాలా సినిమాలు బాగానే అలరించాయి. అయితే తాజాగా రమేశ్‌ వర్మ దర్శకత్వంలో అనుపమ పరమేశ్వరన్‌ జంటగా తమిళ సినిమా రాచ్చసన్‌కు తెలుగు రీమేక్‌గా వచ్చిన రాక్షసుడు మంచి విజయం అందుకోవడంతో ఈ యంగ్ హీరో పెళ్ళి ప్రస్తావన ఇప్పుడు తెరపైకి వచ్చింది.అయితే రాక్షసుడు సినిమా మంచి విజయం అందుకోవడంతో బెల్లంకొండ సురేశ్, శ్రీనివాస్ నేడు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

అయితే ఈ సమావేశంలో సురేశ్‌గారు మాట్లాడుతూ త్వరలోనే శ్రీనివాస్ పెళ్ళి జరగబోతుందని ప్రకటించారు. అయితే అమ్మయి ఎవరు అని అడగగా సినీ పరిశ్రమకు సంబంధించిన అమ్మాయిని కాకుండా బయటి సంబంధాలు చూసున్నామని మా వాడికి తగిన అమ్మాయి అయితే చాలని అన్నారు. అయితే తాజాగా శ్రీనివాస్ చేసిన రాక్షసుడు సినిమా సక్సెస్ చేసిన ప్రేక్షకులందరికి ధన్యవాదాలు తెలిపారు. అంతేకాదు త్వరలోనే తన కుమారుడితో కలిసి పూర్తిస్థాయి కమర్షియల్ సినిమా ఒకటి తీస్తానని దానికోసం ఇప్పటికే గ్రౌండ్ వర్క్ కూడా మొదలుపెట్టానని చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా త్వరలోనే బెల్లంకొండ ఇంట్లో పెళ్ళి భజంత్రీలు మోగుతున్నాయన్నమాట.