పవన్ కు ప్రేమలేఖ.. మనసులో మాట బయటపెట్టిన హీరోయిన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు యూత్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయనను అభిమానులు ఎలా చూసుకుంటారో అందరికీ తెలిసిన విషయమే. అయితే హీరోయిన్ మాధవీలతకు కూడా పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఎన్నోసార్లు ప్రకటించింది. పవన్ కళ్యాణ్ కోసం గతంలో మౌనదీక్షలను కూడా చేసింది. అయితే లేటెస్ట్ గా పవన్ కళ్యాణ్ కోసం తను 2000 సంవత్సరంలో రాసిన ప్రేమ లేఖను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. 2000వ సంవత్సరం జూన్ 6వ తేదీన పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి ఓ ప్రేమకవిత రాసుకున్న మాధవీలత ఫేస్ బుక్‌లో ఆ ప్రేమలేఖను అభిమానులతో పంచుకుంది.

‘మనసులో ఏదో వేదన

కారణం తెలియక పడుతున్నా తపన

హృదయంలో అనురాగం అనే భావన

దానికో రూపం ఇచ్చేందుకే ఈ సాధన

నీవు కనిపించగానే నా హృదయంలో ఏదో బాధ

నా మనస్సుని ఎవరో గట్టిగా పట్టేసినట్టుగా వేదనఒకపక్క సంతోషం, మరోపక్క దుఃఖం కానీ,…. కానీ ఎందుకో తెలీదు

నిను చూస్తున్న ప్రతీక్షణం నేను కారణం చెప్పలేని భావాలలో విలవిల్లాడిపోతాను. దానికి అర్థం ఏంటి? నేను ఎందుకిలా అవుతున్నాను?

ఇది ఆకర్షణా? ప్రేమ అనే వ్యామోహమా?

No. కానే కాదు. అటువంటిది కాదు. మరేంటి?…..’అంటూ తన హృదయంలో పొంగుతున్న ప్రేమ భావనలను అక్షరరూపంలో రాసి అభిమానులతో పంచుకుంది. ఎప్పుడో 19 ఏళ్ల క్రితం మాధవీలత

రాసుకున్న ప్రేమ కవిత ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.