పవన్ ఎఫెక్ట్.. రోజాపై నాగబాబు సెటైర్స్

నాగబాబు — రోజా రాజకీయంగా వేరు వేరు పార్టీలలో ఉన్నప్పటికీ ఇద్దరు కలిసి జబర్దస్త్ షోలో జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. ఎప్పుడు కూడా రోజా .. నాగబాబు రాజకీయాల్లో తిట్టుకున్న దాఖలాలు లేవు. రాజకీయం గా వారి వారి విధి విధానాల పరం గా మాత్రమే ఒకరిని ఒకరు విబేధించుకుంటారు తప్ప అంతకు మించి వ్యక్తిగతం గా టార్గెట్ చేసుకోరు. ఎంతో మంది ముఖ్య నాయకులు మొదట్లో స్నేహితులు అయినా ఆ తర్వాత రోజుల్లో రాజకీయా ల కారణం గా విరోదులు అయిన వారిని చూశాం. ఇక జబర్దస్త్ కారణంగా దాదాపు ఎనిమిది సంవత్సరాలుగా కలిసి సాగుతున్న నాగబాబు మరియు రోజాలు ఇప్పుడు రాజకీయంగా విరోదులు అయ్యారు.

రోజా అధికార పార్టీ వైకాపా లో ఉంటే నాగబాబు జనసేన పార్టీ లో ఉన్న విషయం తెల్సిందే.రోజా పలు మార్లు పవన్ కళ్యాణ్ ను విమర్శిస్తూ వ్యాఖ్యలు చేస్తుంటుంది. అధికార పార్టీ లో ఉన్న రోజా కొన్ని సందర్బాల్లో పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి. అయినా కూడా ఆమె పక్కన కూర్చుని జబర్దస్త్ కు జడ్జ్ గా నాగబాబు చేయడం పై కొందరు ఎప్పటి నుండో విమర్శలు చేస్తున్నారు. ఆ విమర్శల కు ఇటీవల నాగబాబు ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. తన యూట్యూబ్ ఛానెల్ లో మరో వీడియో ద్వారా నాగబాబు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఆ వీడియో లో నాగబాబు మాట్లాడుతూ… రాజకీయం వేరు ప్రొఫెషనల్ లైఫ్ వేరు.ఒక షో లో మేము కలిసి ఉన్నంత మాత్రాన బయట కూడా ఉంటామని చెప్పడం లేదని చెప్పారు.

జబర్దస్త్ లో మేమిద్దరం కేవలం ప్రొఫెషనల్ గా మాత్రమే ఉంటాం. బయటకు వస్తే మేమిద్దం కూడా పెద్దగా కలిసి పోవం. ఒక షోకు జడ్జ్ మెంట్ చెప్పమని పిలిచారు. అది మా ప్రొఫెషన్ కాబట్టి వెళ్లాం. అక్కడ రాజకీయాల గురించి మాట్లాడము. రోజా తో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఆమె తో నాకు ఎలాంటి కంప్లైంట్స్ లేవు. ఒక వేళ ఆమె శృతి మించి పర్సనల్ గా ఎటాక్ చేసినప్పుడు ఖచ్చితంగా ఆమె వ్యాఖ్యల కు నేను బలంగా సమాధానం చెప్తానంటూ నాగబాబు పేర్కొన్నాడు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published.