టిడిపితో మ్యాచ్ ఫిక్సింగ్‌పై పవన్… దెబ్బ అదుర్స్ కదూ!

జనసేన, టిడిపిల మధ్య రహస్య పొత్తు కొనసాగుతోందని కొన్నిరోజుల నుంచి జోరుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే! తెరవెనుక మాత్రమే పవన్, చంద్రబాబులు తిట్టుకుంటున్నారని… తెరవెనుక చాలా తతంగాలు నడుస్తున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాబు అడుగుజాడల్లోనే పవన్ నడుచుకుంటున్నారని వాదనలు చక్కర్లు కొడుతున్నాయి. అటు చంద్రబాబు గానీ, ఇటు పవన్‌గానీ ఈ వ్యాఖ్యల్ని ఖండించకపోవడంతో… రహస్య పొత్తు నిజమేనన్న అనుమానాలు మరింత బలపడ్డాయి.

కానీ… ఆ సందేహాలకు ఫుల్ స్టాప్ పెడుతూ, రహస్య పొత్తు వార్తల్ని పవన్ కళ్యాణ్ ఖండించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రకాశం జిల్లా గిద్దెలూరులో ప్రసంగించిన పవన్… ఈ సందర్భంగా తొలిసారి పొత్తు రూమర్స్‌పై స్పందించారు. తనకు దొంగ పొత్తులు పెట్టుకునే అవసరం ఏమాత్రం లేదని ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ టిడిపితో పొత్తు పెట్టుకోవాలనుకుంటే… తాను ధైర్యంగానే ముందడుగు వేస్తానని చెప్పారు. అంతే తప్ప జగన్‌లా తెరవెనుక పొత్తులు పెట్టుకోనని విమర్శించారు. అయితే… ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి.

టిడిపితో ధైర్యం పొత్తు పెట్టుకుంటానని పవన్ చెప్పిన మాటల్లో కాస్త తేడా కొడుతోందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. అంటే… ఏపీలో ఒకవేళ హంగ్ ఏర్పడితే, ఆయన టిడిపితో కలిసిపోయే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి… అది నిజమవుతుందో లేదో ఎన్నికల రిజల్ట్ వరకూ వెయిట్ చేయాల్సిందే!