పవన్ రీ ఎంట్రీ ఎప్పుడంటే..? తేల్చి చెప్పిన చిరంజీవి

నిన్న సాయంత్రం జరిగిన ‘సైరా’ మీడియా మీట్ కు చిరంజీవితో పాటు దర్శకుడు సురేంద్ర రెడ్డి గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి రావడమే కాకుండా అనేక ఆ సక్తికర విషయాల పై వీరు ముగ్గురు స్పందించారు. ‘సైరా’ టాక్ విషయంలోనే కాకుండా కలక్షన్స్ విషయంలోను సూపర్ హిట్ అన్న సంకేతాలు ఇస్తూ చిరంజీవి అనేక ఆసక్తికర విషయాల పై స్పందించాడు.
ఈ సందర్భంగా ఒక మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ తన కొడుకుతో నటించడం ఎంత ఆనందంగా ఉంటుందో పవన్ కళ్యాణ్ తో తాను నటించడానికి అంత ఆనంద పడుతూ ఎదురు చూస్తున్న విషయాన్ని వివరించాడు.

ఎవరైనా మంచి రచయిత తనకు పవన్ కు సరిపడే ఒక మంచి కథను తీసుకు వస్తే తామిద్దరం నటించడానికి సిద్ధంగా ఉన్నామని సంకేతాలు ఇస్తూ ఈ మూవీని రామ్ చరణ్ నిర్మిస్తాడు అంటూ త్వరలో పవన్ కళ్యాణ్ సినిమా రీ ఎంట్రీ ఉండబోతోంది అన్న విషయాన్ని పరోక్షంగా తెలియచేసాడు.చరణ్ ఒక సినిమాలో నటిస్తూ ఉంటే తాను ఎంత ఆనందపడతానో తన బిడ్డ లాంటి పవన్ కళ్యాణ్ ఒక సినిమాలో నటిస్తున్నప్పుడు అదే స్థాయిలో ఆనంద పడతానని అంటూ పవన్ కళ్యాణ్ సినిమాలకు దూరం అవ్వడు పరోక్షంగా సంకేతాలు ఇచ్చాడు. ఇక చరణ్ కు నిర్మాతగా నూటికి నూరు మార్కులు వేస్తున్నానని అలాంటి బిడ్డ తనకు కొడుకుగా పుట్టడం తన అదృష్టం అంటూ కామెంట్స్ చేసాడు.

ఇదే సందర్భంలో మరొక ట్విస్ట్ ఇస్తూ రానున్న రోజులలో చరణ్ నిర్మాణంలో ఇంకా చాల సినిమాలు వస్తాయని చరణ్ నిర్మించే మరికొన్ని సినిమాలలో తాను నటించే ఆస్కారం ఉంది అన్న క్లారిటీ ఇచ్చాడు. చిరంజీవి ఇచ్చిన లీకులను బట్టి పవన్ రీ ఎంట్రీకి సంబంధించిన మొదటి సినిమా చరణ్ నిర్మాణంలో ఉంటుందా అన్న సందేహాలు నిన్న జరిగిన మీట్ కల్గిస్తున్నాయి..