పవన్ ను కలిసినప్పుడు అలా జరిగింది..? బయటపెట్టిన రాశీ

చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ని మొదలుపెట్టిన అందాల తార రాశి హీరోయిన్ గా చాల మంది అగ్రహీరోల సరసన నటించారు. అలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చిన, తన జీవితం లో జరిగిన పలు ముఖ్య విషయాలను ప్రేక్షకులతో అభిమానులతో పంచుకున్నారు రాశి. పవన్ కళ్యాణ్ కో స్టార్ కావడం తో తన ఇంటికి అపాయింట్మెంట్ లేకుండా వెళ్లిన రాశిని ఎలా ట్రీట్ చేసారో ఆ విషయాల్ని వివరించారు రాశి.గోకులంలో సీత సినిమా లో పవన్ సరసన కథానాయికగా నటించిన రాశీ, పెళ్ళైన తరువాత సినిమాలకు దూరంగా వున్నారు.

అయితే తన కూతురి మొదటి పుట్టిన రోజుకి పవన్ ని ఆహ్వానించడానికి వెళ్ళినపుడు అక్కడ జరిగిన సన్నివేశాన్ని ప్రేక్షకులతో పంచుకున్నారు. పవన్ రాజకీయాలలో బిజీ గా వున్న సమయం లో పవన్ ని కలవడానికి వెళ్లారు రాశి. పవన్ ని కలవాలంటే అపాయింట్మెంట్ తప్పనిసరి. అయితే రాసి తన డ్రైవర్ తో చెప్పి పంపించగా పవన్ రమ్మన్నారని అన్నారు. పవన్ కళ్యాణ్ లేచి నిలబడి చాల మర్యాద పూర్వకంగా రిసీవ్ చేసుకోవడం తో చాల సంతోషంగా ఫీల్ అయ్యానని అన్నారు. ఈ కార్యక్రమంలో తన సినీ జీవితం తో పాటుగా కొన్ని వ్యక్తిగత అనుభబాలను ప్రేక్షకులతో పంచుకున్నారు.