ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. పవన్ షాకింగ్ డెసీషన్

ప‌వ‌న్ క‌ల్యాణ్ రీ ఎంట్రీ గురించి ఆయ‌న అభిమానులు చాలా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఓ వైపు `పింక్‌` రీమేక్ ప‌నులు జ‌రుగుతుంటే, మ‌రోవైపు క్రిష్ ఓ క‌థ‌ని సిద్ధం చేస్తున్నారు. ఈ నెల‌లో గానీ, వ‌చ్చే నెల‌లో గానీ, ఏదో ఓ సినిమా ప‌ట్టాలెక్కుతుంద‌ని అంతా అనుకున్నారు. అయితే ప‌వ‌న్ రీ ఎంట్రీ ఇంకాస్త ఆల‌స్యం అయ్యేలా క‌నిపిస్తోంది. ప‌వ‌న్ జ‌న‌సేన కార్య‌క్ర‌మాల‌తో బిజీగా ఉన్నారు. వాటికి కాస్త బ్రేక్ ఇచ్చి, సినిమాలు చేద్దామ‌న్న‌ది ఆయ‌న ఉద్దేశం.

అయితే.. ఇప్పుడు రాజ‌కీయంగా ప‌వ‌న్ మ‌రింత బిజీ అయ్యే ఛాన్సుంది. డిసెంబ‌ర్ అంతా ఆయ‌న ప్ర‌జాక్షేత్రంలో ఉండాల‌ని భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని కొన్ని ప్రాంతాల్ని ప‌వ‌న్ సంద‌ర్శించాల‌ని, ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వెళ్లాల‌ని భావిస్తున్నార్ట‌. అందుకోసం ప‌వ‌న్ రోడ్ మ్యాప్ కూడా రెడీ అవుతోంది. ప్ర‌జా యాత్ర అయ్యాక‌.. ఆయ‌న కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుని, సినిమాల‌కు త‌గిన‌ట్టుగా స‌న్న‌ద్ధం అవ్వాల్సివుంటుంది. సో.. ఈ యేడాది ఆయ‌న రీ ఎంట్రీ ఉండ‌క‌పోవ‌చ్చు.